శరీరంలో అధిక యూరిక్ యాసిడ్ వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏంటో తెలుసా..!

Divya
సాధారణంగా మనం తిన్న ఆహార పానీయాలను వడకట్టి, వ్యర్తన్ని మూత్రపిండాలు మూత్రం ద్వారా బయటికి పంపిస్తాయి.కానీ కొంతమంది శరీరంలోని కిడ్నీ ల పనితీరు సక్రమంగా ఉండదు. అలాంటి వారికి వ్యర్థలు,యూరిక్ యాసిడ్ స్ఫటికాలు మారుతాయి. ఈ స్పటికాలు విచ్ఛిన్నమై,శరీరంలోని కీళ్ల కణజాలన్ని చేరి,ఎముకల దృఢత్వాన్ని దెబ్బతీస్తాయి. దీనివల్ల చాలామందికి ఆర్థరైటిస్, వాపు, కీళ్ల నొప్పి సమస్యలు ఏర్పడుతాయి. యూరిక్ యాసిడ్ అధికం అవడం వల్ల కలిగే మరిన్ని దుష్ప్రభావాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
యూరిన్ యాసిడ్ పెరగడానికి కారణాలు..
శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగడానికి అనేక కారణాలు చెప్పవచ్చు. సమయానికి ఫూడ్ తీసుకోకపోవడం, తగినంత నిద్ర లేకపోవడం వంటివి అసలైన కారణాలుగా చెప్పవచ్చు. అంతేకాక మాంసాహారాలు,కాయధాన్యాలు, కిడ్నీ బీన్స్, పనీర్, రైస్, ఆల్కహాల్ వంటి ఆహారాలను అధికంగా తీనడం వల్ల ప్యూరిన్(వ్యర్థం )అధిక మొత్తంలో పేరుకుపోతుంది.కొన్ని సమయాల్లో కిడ్నీ లు వ్యర్దాలను వడకట్టలేకపోతాయి. అటువంటి పరిస్థితిలో ప్యూరిన్ స్థాయి పెరిగి, రక్తం, కీళ్ళ కణజాలాన్ని చేరి విపరీతంగా నొప్పులు, అలసట, నిసత్తువ,ఉన్నట్టు ఉండి కళ్లు తిరగడం వంటి వాటిని కలిగిస్తాయి.ఇది కాకుండా కొన్నిసార్లు వంశపారపర్యం , అధిక బరువు, ఒత్తిడి కారణంగా కూడా శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరగడానికి దోహదపడతాయి.
అధిక మొత్తంలో వున్న యూరిక్ యాసిడ్ ను నివారించుకోవడానికి..
* అధికంగా కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడేవారు, సరైన జీవన విధానం,సరైనా సమయంలో ఆహారం తీసుకోవడం, నిద్ర సమయాలను పాటించడం వంటివి చేయాలి.
* ప్రోటీన్ అధికంగా వున్న రెడ్ మీట్ , ధాన్యాలు, బీన్స్, పాలకూర మొదలైన ఆహారాలకు దూరంగా ఉండాలి. *ఆల్కహాల్ లేదా బీర్ తాగే అలవాట్లు మానుకోవాలి.
* రోజూ అరగంట సేపు వాకింగ్, ఎక్సరసైజ్, యోగా వంటివి అలవాటు చేసుకోవాలి.
*వాటర్ కంటెంట్ అధికంగా వున్న పుచ్చకాయ, మస్క్ మెలన్, కోకోనట్ వాటర్ ఎక్కువగా తాగుతుండాలి.రోజుకు మూడు నుంచి నాలుగు లీటర్ నీటిని తాగుతుండాలి.ముఖ్యంగా ఒత్తిడికి దూరంగా ఉండాలని ఆరోగ్యనిపుణులు సూచిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: