జలుబు, దగ్గు రాకుండా ఈ టీ తాగండి?

Purushottham Vinay
ఇంటి చిట్కాలు మనకు చాలా మేలు చేస్తాయి. అవి ఎలా చెయ్యాలో తెలిస్తే చాలు. మన ఆరోగ్యం మన వెంట వున్నట్టే. ఇంటి చిట్కాలు చాలా ప్రభావవంతంగా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.అంతేగాక వైరల్ జ్వరాలకు కూడా ఈ ఇంటి నివారణలు చాలా బాగా పనిచేస్తాయి.మన ఇంటి నివారణలలో తులసి మొక్క ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. తులసి మొక్కలోని అన్ని భాగాలు కూడా ఎన్నో ఔషధ గుణాలతో నిండి ఉన్నాయి. తులసి ఆకులు ప్రకృతి ప్రసాదించిన ఉత్తమ యాంటీబయాటిక్స్. ప్రతి రోజూ కూడా ఖాళీ కడుపుతో రెండు మూడు తులసి ఆకులు తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచడానికి ఇంకా అలాగే కాలానుగుణ ఫ్లూ ఇంకా వైరస్‌ల నుండి సురక్షితంగా ఉండటానికి తులసి ఆకులను ఉపయోగిస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది.తులసి, పుదీనా ఆరోగ్యానికి చాలా మంచివి. మన పూర్వికులు తర తరాల నుంచి వీటిని వాడుతున్నారు.


వీటికి జలుబు, దగ్గు, ఉబ్బసం, కఫా రుగ్మతలు ఇంకా అలాగే ఇతర గొంతు వ్యాధులను చాలా ఈజీగా నయం చేసే శక్తి ఉంది.ఈ చలికాలంలో ఖచ్చితంగా జలుబు చేసి తీరుతుంది.అందుకే తులసి ఇంకా పుదీనాను మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఈ సమస్యని చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు.జలుబు, దగ్గు, ఉబ్బసం ఇంకా అలాగే ఇతర గొంతు వ్యాధులను తక్షణమే నయం చేసే శక్తి తులసికి ఉంది. ఇంకా అలాగే జీర్ణక్రియను కూడా బాగా మెరుగుపరుస్తుంది.తాజా వాసన గల పుదీనా ఆకులు జలుబు ఇంకా కఫా రుగ్మతలకు మంచివి. వీటితో ఈ చలికాలంలో టీ చేసుకొని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది.తాజా తులసి ఇంకా అలాగే పుదీనాని తీసుకొని ఆ రెండింటినీ కూడా బాగా కడగాలి.ఆ తర్వాత రెండింటినీ ఒక గ్లాసు నీళ్లలో వేసి బాగా మరిగించాలి.ఆ రసం బాగా ఉడికిన తర్వాత వడగట్టి అందులో తేనె లేదా తాటి బెల్లం, లేదా కలకండ లేదా ఎండుద్రాక్ష వేసి కలిపి తాగాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: