బొప్పాయి నీరు ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా?

Purushottham Vinay
బొప్పాయి వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ఇంకా అలాగే బొప్పాయి వాటర్ వల్ల కూడా ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.అయితే బొప్పాయి నీళ్లు ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. బొప్పాయి పండును తీసుకొని ముందుగా దానిని సగానికి కట్‌ చేయాలి. ఆ తర్వాత పై తొక్క ఇంకా బొప్పాయి గింజలను తీసేయాలి.ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ బొప్పాయి ముక్కలను నీటిలో ఒక 5 నిమిషాలు పాటు ఉడకబెట్టండి. వాటిని మరిగించిన తర్వాత నీటిని చల్లారనివ్వాలి. అలాగే ఈ నీటిని ఫ్రిజ్‌లో ఉంచి వాటిని రెగ్యులర్‌గా తాగాలి. ఇలా ప్రతిరోజూ ఈ హెల్దీ డ్రింక్‌ను తాగితే చాలా మంచిది.ఇది మీ ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది.అలాగే బరువు తగ్గాలనుకునేవారికి బొప్పాయి చాలా మంచి ఆహారం.బొప్పాయి నీటిని ఉదయాన్నే తాగడం వల్ల ప్రేగులను చాలా శుభ్రంగా ఉంచడంతో పాటు ఆరోగ్యంగా కూడా చేస్తుంది. కేవలం బొప్పాయి మాత్రమే కాదు ఏదైనా ఫ్రూట్ వాటర్ (డిటాక్స్ వాటర్ ఓవర్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్) రోజులో ఎప్పుడైనా కూడా తీసుకోవచ్చు.


అయితే ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి నీళ్లు తాగడం వల్ల చాలా రకాలుగా మేలు జరుగుతుంది. ఎందుకంటే ఇందులో పాపైన్ ఎంజైమ్ ఉంటుంది. ఇది మన ప్రేగుల ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.బొప్పాయి నీళ్లలో విటమిన్లు చాలా పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్‌ను కూడా నివారిస్తాయి. ఇంకా అలాగే పొట్టకు కూడా చాలా మేలు చేస్తుంది. అలాగే ఇది రుతుస్రావం సమయంలో తీవ్రమైన నొప్పుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. ఇంకా అలాగే కిడ్నీలను చాలా ఆరోగ్యవంతంగా చేస్తుంది. ఇంకా అలాగే మైగ్రేన్ నొప్పిని కూడా నివారిస్తుంది. ఈ బొప్పాయి నీళ్లలో లైకోపీన్ ఉంటుంది. ఇది శరీరానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇది క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల నుంచి కూడా రక్షణ కలిగిస్తుంది. ఇక బొప్పాయిలో పెద్ద మొత్తంలో ఫైబర్ అనేది ఉంటుంది.కానీ దానిని నీటిలో ఉడకబెట్టినప్పుడు, లైకోపీన్ అనేది దాని నుండి బయటకు వస్తుంది, ఇది మన శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: