బాదం: చలికాలంలో ఇలా తింటే ఎన్నో లాభాలు?

Purushottham Vinay
బాదంపప్పులు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఈ బాదం పప్పుల వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలు కూడా ఉన్నాయి.విటమిన్లు, ఖనిజాలు, కొవ్వు ఆమ్లాలు ఇంకా అలాగే ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉండే బాదంను ఆరోగ్యానికి సూపర్ ఫుడ్ గా చెప్పవచ్చు.ఇది రోగ నిరోధక శక్తిని పెంపొందించడంతో పాటు మెదడు కూడా బాగా చురుకుగా ఉండేలా చేస్తుంది.ఇంకా అలాగే పోషకాహార లోపాన్ని నివారించుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా రోజూ బాదంపప్పును ఆహారంలో భాగం చేసుకోవడం చాలా అవసరం. అయితే బాదంపప్పు తినే సమయంలో వాతావరణం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వేసవి కాలంలో కంటే చలికాలంలోనే బాదంపప్పును ఎక్కువగా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకుంటే చలికాలంలో వాతావరణం అనేది చాలా చల్లగా ఉంటుంది. ఇంకా అంతే కాకుండా శరీర ఉష్ణోగ్రత కూడా ఈజీగా పడిపోతుంటుంది. ఈ సమయంలో బాదం పప్పు అనేది శరీరం వెచ్చగా ఉంచేలా చేస్తుంది. అందుకే దీన్ని తినాలి. ఇంకా అలాగే చలికాలంలో బాదంపప్పును వేయించి కూడా తినవచ్చు. ఇలా చేయడం వల్ల అందులోని పోషకాలు శరీరానికి ఖచ్చితంగా సమంగా అందుతాయి.


ఇంకా అలాగే కొన్ని బాదం పప్పులను తీసుకొని వాటిని దోరగా వేయించుకోవాలి. ఇంకా అలాగే అందులో కాస్త నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఆరోగ్యంగా ఇంకా అలాగే రుచికరంగా కూడా ఉంటుంది.అయితే బాదంపప్పును వేయించి తినడం ఇష్టం లేని వాళ్లు మాత్రం దీన్ని పొడిగా చేసుకుని పాలల్లో కలుపుకుని తాగవచ్చు. బాదంలో ఉండే పోషకాలు ఇంకా అలాగే పాలలో ఉండే కాల్షియం ఎముకలు చాలా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. మీరు బాదం పొడిని తీసుకుని రోస్ట్ చేస్తే చాలు. ఆ పౌడర్ ను చక్కగా పాలల్లో కలుపుకోని తాగవచ్చు. ఇలా వారానికి కనీసం మూడు సార్లు తాగడం అలవాటు చేసుకుంటే మీ ఆరోగ్యానికి మంచి లాభం ఉంటుంది. బాదంపప్పును వేయించి పాయసంలో కలుపుకుని కూడా తినవచ్చు. సెమోలినా (రవ్వ) ఇంకా అలాగే బాదం పప్పులను కలిపి తింటే రెట్టింపు ప్రయోజనాలను మీరు పొందవచ్చు. చలికాలంలో తయారుచేసే ఈ రకమైన ఆహార పదార్థాలు శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో చాలా ప్రభావవంతంగా పని చేస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: