కర్పూరం: లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే?

Purushottham Vinay
శరీరంపై మనకు తెలియని ఎంతో బాక్టీరియా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజూ మనం స్నానం చేసే నీటిలో కర్పూరాన్ని వేసుకుని స్నానం చేయడం వల్ల శరీరంపై ఉండే సూక్ష్మ క్రిములు నశిస్తాయి. కొన్ని కర్పూరం బిళ్లను మూటగా కట్టి రాత్రి పడుకునే ముందు మన మీద వేసుకుని పడుకోవాలి. ఇలా చేయడం వల్ల శరీరంలో రక్తప్రసరణ సాఫీగా సాగుతుంది. కర్పూరం శరీరంలో జీవక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా బ్రష్ మీద కర్పూరం పొడిని వేసి దానిపై టూత్ పేస్ట్ ను వేసి దంతాలను శుభ్రం చేసుకోవాలి. ఇలా కర్పూరంతో దంతాలను శుభ్రం చేసుకోవడం వల్ల దంత సమస్యలన్నీ దూరం అవుతాయి. కర్పూరంతో దేవుడికి హారతి ఇస్తూ ఉంటారు.ఆ సమయంలో కర్పూరం నుండి పొగ ఎక్కువగా వస్తుంది. ఈ పొగను పీల్చడం వల్ల మనకు ఎన్నో రకాల ఆరోగ్యప్రయోజనాలు కలుగుతాయట. కళ్లకు మేలు చేస్తుంది కనుకనే కాటుకలో దీనిని వాడతారు. జలుబు, కఫాన్ని తగ్గిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేసి రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. దేవాలయం వంటి పవిత్ర ప్రదేశాలలో కూడా స్త్రీ , పురుషుల మధ్య ఆకర్షణ కలిగే అవకాశం ఉంది. మనసు చంచలమయ్యే అవకాశం ఉంది. అలాంటి కామ కోరికలు కలగకుండా కర్పూరం మనకు మేలు చేస్తుంది.


పురుగుల మందుల్లో, చెడు వాసనల నావారణకు, బట్టలను కొరికి తినే చెద పురుగులు, ఇతర కీటకాల నిర్మూలనకు, దోమల నివారణకు కర్పూరాన్ని  ఉపయోగిస్తారు.కర్పూరాన్ని వెలిగించగా వచ్చే పొగను పీల్చడం వల్ల ఆందోళన, ఒత్తిడి, అస్థమా, తట్టు, తత్తర పాటు, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు తగ్గిపోతాయట. అంతేకాకుండా ఈ పొగ కారణంగా గాలిలో ఉండే క్రిములు, బ్యాక్టీరియా వంటివి కూడా నశిస్తాయట. చర్మ సంబంధిత సమస్యలు దూరం అవుతాయట.జ్ఞాపకశక్తి వృద్ధి చెందుతుందట. కర్పూరాన్ని వెలిగించడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఈ పాజిటివ్ ఎనర్జీ అంతా మనలోకి వెళ్లి మనకు అంతా మంచే జరుగుతుందట. వేపాకు ముద్దలో కర్పూరాన్ని కలిపి తలకు పట్టించాలి. గంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల తలలో పేల సమస్య తగ్గుతుంది.


మార్కెట్ లో రసాయనాలతో చేసిన కర్పూరం కూడా లభిస్తుంది. దీనిని వాడడం వల్ల మనం అనారోగ్యాల బారిన పడాల్సి వస్తుంది. కనుక సహజసిద్దంగా తయారు చేసిన కర్పూరాన్ని వాడి ఆరోగ్య ప్రయోజనాలు పొందవల్సిందిగా నిపుణులు సూచిస్తున్నారు.గుండె సమస్యలకు, అలసటకు కొద్ది మొత్తంలో కర్పూరం వాడితే ఫలితం ఉంటుంది. అన్నీ రకాల ఆర్థరైటిస్ సమస్యలను, రుమాటిక్ నొప్పులను, నడుము నొప్పిని, నరాల సంబంధించిన నొప్పులను తగ్గించడంలో కర్పూరం చక్కగా పని చేస్తుంది. పుండ్లు మానడానికి , గజ్జి, తామర వంటి ఇన్ ఫెక్షన్ లను తగ్గించడానికి కూడా కర్పూరాన్ని ఉపయోగిస్తారు.


యాంటీ సెప్టిక్ గా కూడా కర్పూరం ఉపయోగపడుతుంది. నాసిక సమస్యలను కూడా కర్పూరాన్ని వాడతారు. అందుకే విక్స్ వెపోరబ్ వంటి వాటిల్లో ఆయింట్ మెంట్ లలో చర్మానికి పూతగా పూసే వాటిల్లో కర్పూరాన్ని ఉపయోగిస్తారు. శ్వాస నాళాల్లో ఊపిరి సలపడానికి వాడే మందుల్లోనూ దీనిని వాడతారు. కర్పూరం నూనెలో దూదిని ముంచి కుష్టు వ్యాధి వల్ల కలిగిన గాయాలపై రాస్తే గాయాలు త్వరగా మానిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: