లైఫ్ స్టైల్: చుండ్రు వల్ల జుట్టు రాళ్లతోందా.. అయితే ఇలా చేయండి..!!

Divya
వాతావరణం లో పెను మార్పులు కారణంగా తరచూ ఎక్కువగా తడవడం వల్ల తడి జుట్టు నీ జడగా వేసుకోవడం వల్ల, తల స్నానం సరిగ్గా చేయకపోయినా అనేక రకాల కారణాల చేత చుండ్రి సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. చుండ్రు సమస్య ఉందంటే జుట్టు రాలే సమస్య కూడా అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. కాబట్టి చుండ్రు సమస్య ప్రారంభం కాగానే మనం కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తే సరిపోతుందని కొంతమంది నిపుణులు తెలియజేస్తున్నారు. వాటి గురించి తెలుసుకుందాం.
అయితే ఎక్కువగా చుండ్రు సమస్యలతో బాధపడుతున్నట్లు అయితే మార్కెట్లో దొరికేటువంటి షాంపూలు ,నూనెల వాడడం మంచిది కాదు. వాటి వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాకాకుండా మన ఇంట్లోనే సులువుగా అందుబాటులో ఉండే కొన్ని వస్తువులను ఉపయోగించి చుండ్రు సమస్యలను సులభంగా తొలగించుకోవచ్చు. అదేమిటంటే ఒక ఉల్లిపాయను తీసుకొని దానిపైన ఉండే తొక్కను తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ తర్వాత  అల్లం ముక్కని తీసుకొని పై తొక్క తీసి వీటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి.. వాటిని మిక్సీలోకి వేసి ఉల్లిపాయ ముక్కలను అల్లం ముక్కలను , కరివేపాకును వేసి బాగా పేస్టులాగా చేయాలి.

ఈ పేస్టు నుంచి జ్యూస్ ను సపరేట్ చేసి ఆ జ్యూస్ ను ఒక బౌల్లోకి తీసుకొని అందులో కొన్ని మిరియాలు వేసి.. అలోవెరా వేసి అన్ని బాగా కలపాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని కొద్దిసేపు అలాగే ఉంచిన తర్వాత జుట్టు చివర్ల వరకు పట్టించాలి. అలా ఒక గంట సేపు అయిన తర్వాత తల స్నానం చేస్తే చుండ్రు సమస్య తగ్గుతుంది. వారంలో ఒకసారి ఇలా చేసిన చుండ్రు సమస్య తగ్గుతుంది. దీంతోపాటు జుట్టు కూడా చాలా ఒత్తుగా పెరుగుతుందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: