లైఫ్ స్టైల్: కూరగాయలు తాజాగా ఉండాలి అంటే ఇలా చేయండి..!!

Divya
ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో ప్రతి ఒక్కరు నిద్ర లేవగానే హడావిడిగా తమ పనులు తాము చేసుకుంటూ ఆఫీసులకు వెళుతూ ఉంటారు. ఇక అంతేకాకుండా వంట చేయడానికి కూడా అందుకు తగ్గ సమయం ఉండకపోవచ్చు. అందుచేతనే సమయం ఆదా చేసుకోవడం కోసం ముందు రోజు రాత్రి కూరగాయలను కట్ చేసుకొని వాటిని ఫ్రిజ్లో ఉంచుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. అయితే ఇలా కట్ చేసిన కూరగాయలు ఫ్రిజ్లో ఉంచినా కూడా కొన్నిసార్లు నల్లగా మారుతూ ఉంటాయి. అయితే అలా అవ్వకుండా ఉండాలి అంటే ఇలా చేస్తే సరిపోతుంది.

1).ముఖ్యంగా క్యాబేజీ , క్యాలీఫ్లవర్ వంటి వాటిని కట్ చేసినప్పుడు లైట్ గా ప్రెస్ చేసి టిష్యూ పేపర్ పైన వాటిని చూసి ఫ్రిజ్లో ఉంచాలి.

2). అయితే ఆకుకూరలు కట్ చేసినప్పుడు త్వరగా చెడిపోకుండా ఉండాలి అంటే ముందుగా ఆకుకూరల కాడల నుంచి ఆకులను తొలగించి భద్రపరచాలి ఆ తర్వాత వాటిని ఒక కాగితంలో చుట్టి ఫ్రిజ్లో ఉంచినట్లు అయితే ఫ్రెష్ గా ఉంటాయి. ముఖ్యంగా బినిస్ వంటి వాటిని ప్లాస్టిక్ బ్యాగులో ఉంచితే చాలా కాలం పాటు చెడిపోకుండా ఉంటాయి.
3). ఎక్కువగా ఉపయోగించే వాటిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అని చెప్పవచ్చు.. వీటిని తయారు చేసి ఫ్రిజ్లో చాలామంది అలానే ఉంచుతూ ఉంటారు. అయితే ఇది చాలా కాలం పాటు నిల్వ ఉండాలి కాబట్టి.. ముందుగా ఉల్లిపాయల పోట్టు ని వెల్లుల్లిపాయల పొట్టు లను తీసివేసి బాగా పేస్టులాగా చేసి ఏదైనా డబ్బాలు ఉంచి ఫ్రిజ్లో ఉంచితే చాలా కాలం పాటు ఉంటుంది. అయితే ఉల్లిపాయలను మాత్రం ఒక్కరోజు కంటే ఎక్కువగా ఫ్రిజ్లో ఉంచకూడదట.
4). అయితే క్యారెట్, బీట్రూట్ ఇతర వాటిని ఎక్కువగా కట్ చేసి గాలి చొరబడకుండా టైట్ గా కట్టేసి ఫ్రిజ్లో ఉంచితే ఫ్రెష్ గా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: