చనిపోయే టైంలో ఈ వస్తువులు దగ్గరుంటే.. స్వర్గం ప్రాప్తిస్తుందట?

praveen
ఇటీవలే గణేష్ విమోచన కార్యక్రమాలు ముగిశాయి. దీంతో మరికొన్ని రోజుల్లో పితృ పక్షం ప్రారంభమవుతు ఉంటుంది అనే విషయం తెలిసిందే. చనిపోయిన పూర్వీకుల అందరికీ కూడా  పిత్రు అమావాస్య లోపు తర్పణం పిండప్రధానం లాంటివి చేస్తూ ఉంటారు. పితృ పక్షం లో పూర్వీకులు భూలోకానికి వస్తారని అందరు నమ్ముతూ ఉంటారు. అయితే సాధారణంగా మనిషి చనిపోయిన సమయంలో స్వర్గానికి వెళ్లాలి అని అనుకుంటూ ఉంటారు అందరూ. అయితే చనిపోయే సమయంలో అతడి వద్ద నాలుగు వస్తువులు ఉంటే అతని ఆత్మ స్వర్గానికి వెళ్తుందట. ఈ క్రమంలోనే  శ్రాద్ధకర్మలు చేయాల్సిన అవసరం కూడా ఉండదట. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం..

 తులసి: చనిపోయే టైంలో వ్యక్తి పక్కన తులసి మొక్క ఉంటే ఎంతో మంచిదట. ఇక అతని నుదుటి పై నోటిఫై తులసి ఆకులు ఉంచితే కూడా మంచిదేనట. చనిపోయే సమయంలో  వ్యక్తి నోటిలో తులసి తీర్థం పోస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇలా తులసి చెట్టు పక్కన ఉంటే నేరుగా స్వర్గానికి వెళ్తారట.
 గంగా జలం : చనిపోయే టైంలో నోటిలో గంగాజలం పోస్తే స్వర్గ ప్రాప్తి కలుగుతుందని ఎంతోమంది నమ్ముతుంటారు. ఇక ఇలా గంగా జలాన్ని తాగిన వారు విష్ణుమూర్తి వైకుంఠంలో చోటు దక్కించుకుంటారు అనే నమ్మకం కూడా ఎంతోమంది లో ఉంది. చనిపోయిన తర్వాత అస్తికలను అందుకే గంగాజలంలో నిమజ్జనం చేస్తారట.
 నువ్వులు : విష్ణుమూర్తి
 చెమట నుంచి నువ్వులు పుట్టాయి అని అంటూ ఉంటారు. అందుకే చనిపోయే టైంలో వ్యక్తి చేతితో నువ్వులు దానం చేయించాలట. తద్వారా చనిపోయిన  తర్వాత వారు స్వర్గప్రాప్తిలవుతారట.
కుష్ గడ్డి : కుష్ గడ్డి అనేది ఒకరకమైన గడ్డి అది ఎంతో మహిమాన్వితం అయినది అని చెబుతూ ఉంటారు. విష్ణుమూర్తి  రోమాలు నుంచి ఉత్పన్నమైనదని ఎంతోమంది ప్రగాఢంగా విశ్వసిస్తారు. చనిపోయే వ్యక్తి బెడ్ షీట్ పై కు గడ్డి పరచాలని ఇలా చేస్తే స్వర్గం ప్రాప్తిస్తుందని ఎంతోమంది నమ్ముతూ  అంటూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: