లైఫ్ స్టైల్: కోడికూర ఎక్కువగా తింటే ఆ సమస్యలు వస్తాయా..!!

Divya
నాన్ వెజ్ ప్రియులకు చికెన్ అంటే చాలా ఇష్టం అని చెప్పవచ్చు.. ఏలాంటి ఫంక్షన్ అయినా సరే.. పార్టీ అయినా సరే ఖచ్చితంగా అందులో చికెన్ ఉండాల్సిందే. ఇక చికెన్ ఐటమ్స్ ఎక్కువగా తింటూ ఉంటారు. ఇందులో ఎక్కువగా ప్రోటీన్లు ఉంటాయి అందజేసిన చాలా మంది వీటిని తినడానికి ఇష్టపడుతూ ఉంటారు ఇది శరీరానికి కావలసిన పోషకాలను సమృద్ధిగా అందిస్తుంది. అంతేకాకుండా కండరాలు దృఢంగా మారేందుకు కూడా చాలా సహాయపడుతుంది. కోడికూరలో బ్రెస్ట్ లో లూసిన్ అనే పదార్థం చాలా పుష్కలంగా లభిస్తుంది. అందుచేతనే బరువు పెరగాలనుకునేవారు చికెన్ అని ఎక్కువగా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు.

ఇక అంతే కాకుండా కోడికూరను ఎక్కువగా తింటే ఆరోగ్యం పై చెడు ప్రభావం చూపుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు. చికెన్ వండే సమయంలో కాస్త జాగ్రత్తలు వహించాలని.. మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు కారణంగా భారీ మూల్యాన్ని చెల్లించవలసి ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నాను. అయితే కొంతమంది పరిశోధకులు తెలిపిన ప్రకారం చికెను ఎక్కువగా తింటే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ చాలా పెరుగుతాయి అట ఆ తర్వాత రక్తం మందమౌతుంది. దీంతో రక్తనాళాలు రక్తం ప్రవాహం సరిగ్గా జరగక గుండె సంబంధిత సమస్యలు వస్తాయట.

చికెన్ లో ఉండే ప్రోటీన్ వల్ల బరువు పెరగడమే కాకుండా బరువు తగ్గాలనుకునేవారు చికెన్ కు దూరం ఉండడం మంచిది. అయితే ఒక అధ్యయనంలో తెలిపిన ప్రకారం శాఖాహారాల కంటే నాన్ వెజ్ తినే వారే ఎక్కువ బరువు ఉంటున్నట్లుగా ఒక అధ్యయనంలో తెలియజేయడం జరిగింది. చికెన్ ఎక్కువగా తింటే మూత్రణాల ఇన్ఫెక్షన్ తదితర సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ మోతాదు మించితే పలు అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. ఇక అంతే కాకుండా మూత్ర పిండాల సమస్యలతో పాటు పలు ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: