లైఫ్ స్టైల్: దానిమ్మ గింజలతో కలిగే ప్రయోజనాలు తెలిస్తే షాక్..!

Divya
సాధారణంగా దానిమ్మ గింజలను చిన్నపిల్లల నుండి పెద్ద వాళ్ల వరకు ప్రతి ఒక్కరు కూడా తినడానికి ఆసక్తి చూపిస్తారు. ముఖ్యంగా ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉండే పండ్లలో దానిమ్మ కూడా ఒకటి. చూడడానికి ఎర్రగా నిగనిగలాడుతూ చక్కటి రుచి కలిగిన ఈ పండ్లతో మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఇక ప్రస్తుతం వీటి ధరలు మార్కెట్లో ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో సామాన్య ప్రజలు దానిమ్మ పండ్లు కొనుగోలు చాలా కష్టతరంగా మారింది. ఇకపోతే దానిమ్మ చెట్టును కనుక మీ పెరట్లో పెంచినట్లయితే ఏ సీజన్లో అయినా సరే కష్టపడకుండా ఎక్కువ ఖర్చు చేయకుండా వీటిని సునాయాసంగా తినవచ్చు.
మరి ప్రతిరోజు దానిమ్మ పండ్లు గింజలను ఒక కప్పు చొప్పున ప్రతిరోజు తినాలి లేదా దానిమ్మ రసం అయినా సరే తాగాలి. ఇక ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత టీ,  కాఫీ వంటి పానీయాలకు బదులుగా దానిమ్మ జ్యూస్ తాగితే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇకపోతే దానిమ్మ గింజలలో లభించే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా వైరస్,  బ్యాక్టీరియా,  ఇన్ఫెక్షన్లు వంటివి రాకుండా మన శరీరాన్ని కాపాడతాయి. ముఖ్యంగా సంతానం కోసం ఎదురుచూస్తున్న వారు ప్రతి రోజు దానిమ్మ గింజలను తింటే వారిలో సంతాన సాఫల్యం కలుగుతుందని వైద్యులు కూడా సూచిస్తున్నారు.
ఇక అంతేకాదు ఇటీవల వస్తున్న కరోనా,  మంకీ ఫాక్స్ లాంటి వైరస్ల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే మనలో రోగనిరోధక శక్తి చాలా అవసరం. కాబట్టి ప్రతి రోజు దానిమ్మ పండ్లను తింటే మన శరీరానికి కావలసిన ఇమ్యూనిటీ పవర్ కూడా లభిస్తుంది. ఇక అలాగే క్యాన్సర్ రాకుండా అడ్డుకునే చక్కటి పోషకాలు ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా దానిమ్మ గింజల్లో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలతో పాటు గ్యాస్, కడుపుబ్బరం , మలబద్ధకం వంటి సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు. ఇక దగ్గు,  జలుబు గుండె సమస్యలు అధిక కొలెస్ట్రాల్ చిన్నారుల్లో మెదడు ఆక్టివ్ గా లేకపోవడం ఇలాంటి ఎన్నో సమస్యలకు దానిమ్మ గింజలు చక్కటి పరిష్కారం అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: