గుమ్మడి గింజలతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా?

Purushottham Vinay
గుమ్మడి గింజల్లో పోషకాలు(Nutrient) చాలా సమృద్ధిగా ఉంటాయి.ఇంకా అలాగే ఎన్నో వందల ఏళ్ల క్రితమే వాటి గింజల్లో ఔషధ గుణాలు ఉన్నాయని గుర్తించారు మన భారతీయులు. వీటిని తరచూ తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి. ఇంకా మూత్రాశయ ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే హైబీపీ తగ్గించడంలో ఈ గింజలు చాలా కీలకపాత్ర పోషిస్తాయి. గుమ్మడి(Pumpkin) గింజల్లో B1, B2, B3, B5, B6, B9, C, E, K వంటి విటమిన్‌లు చాలా పుష్కలంగా ఉంటాయి. ఇక సైన్స్ డైరెక్ట్‌లోని ఒక రిపోర్ట్ ప్రకారం.. గుమ్మడి గింజల్లో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు అనేవి ఉంటాయి. కాబట్టి వీటిని తరచు తీసుకుంటే కొలొరెక్టల్, రొమ్ము ఇంకా అలాగే కడుపు క్యాన్సర్‌ల రిస్క్‌ తగ్గుతుంది.ఈ గుమ్మడి గింజల్లో మెగ్నీషియం అనేది పుష్కలంగా ఉంటుంది. ఇక నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం.. రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గించడంలో ఇవి చాలా కీలక పాత్ర పోషిస్తాయి.దీంతో మధుమేహం సమస్య ఉన్నవారు ఈ గింజలను తింటే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.ఈ గుమ్మడి గింజల్లో అమినో యాసిడ్ ఉంటుంది. ఇది మంచి నిద్రను కూడా ప్రోత్సహిస్తుంది. అలాగే వీటిలో ట్రిప్టోఫాన్, జింక్ ఇంకా మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి.


ఇవన్నీ కూడా నిద్రను మెరుగుపర్చడంలో ముఖ్య భూమికను పోషిస్తాయి. మీ నిద్రను మెరుగుపర్చడం కోసం నిద్రపోయే ముందు ఖచ్చితంగా ఒక గ్రాము గుమ్మడి గింజలను తినండి.గుమ్మడి గింజల్లో మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఇక ఈ పోషకం ఎముకలు బలంగా పెరిగేలా చేస్తుంది. అలాగే రక్తపోటు, రక్తంలో షుగర్ లెవల్స్, గుండె ఇంకా అలాగే ఎముకల ఆరోగ్యానికి సరిపడినంత మెగ్నీషియం లెవల్స్ అవసరం. గుమ్మడికాయ గింజలు ఎముకలు పగుళ్లు వచ్చే అవకాశాలను కూడా ఈజీగా తగ్గిస్తాయి.ఈ గుమ్మడికాయ గింజలను తరచు తీసుకుంటూ ఉండాలి. దీంతో కొలెస్ట్రాల్ ఇంకా అలాగే రక్త నాళాలు గట్టిపడకుండా ఇవి నిరోధిస్తాయి.ఇంకా అలాగే కొరోనరీ ఆర్టరీ వ్యాధి ఇంకా స్ట్రోక్ వంటి వివిధ గుండె సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో గుమ్మడి గింజలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: