సగ్గుబియ్యం : ఇలా తింటే అన్ని సమస్యలు మాయం!

Purushottham Vinay
నోటికి మంచి రుచిని ఇచ్చే ఫాస్ట్ ఫుడ్ తినడానికి ప్రజలు ఎక్కువగా ఆసక్తిగా చూపిస్తున్నారు కానీ అది ఎంత వరకు మన ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది అనే విషయాల గురించి మాత్రం అసలు ఆలోచించటం లేదు. అందువల్ల షుగర్, బీపీ, థైరాయిడ్,అధిక బరువు ఇంకా రక్త హీనత వంటి ఆరోగ్య సమస్యలతో  బాగా సతమతమవుతున్నారు. ఈ కాలంలో పిల్లల దగ్గర నుండి పెద్దల దాకా కూడా రక్తహీనత సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఫలితంగా నీరసం రావడం, ఊరికే అలసటకు లోనవ్వడం,ఆయాసం, గుండె దడ, కాళ్ళు చేతులు చల్లగా మారటం ఇంకా అలాగే కళ్ళు తిరగడం వంటి లక్షణాలతో బాధ పడుతున్నారు.ఇక ఎవరిలో అయిన పైన చెప్పిన లక్షణాలు కనిపించినప్పుడు ఏ మాత్రం అశ్రద్ధ చేయకుండా వెంటనే మీ బ్లడ్ పెర్సెంటేజ్ ఎంత ఉందో ఖచ్చితంగా చెక్ చేసుకోండి.కేవలం మందులతో మాత్రమే కాకుండా మనం తినే ఆహారంలో కూడా రక్తం పడే ఆహారాన్ని ఎంచుకుంటే ఖచ్చితంగా రక్తహీనత సమస్యకు ఈజీగా చెక్ పెట్టవచ్చు. అలాంటి ఆహార పదార్ధాలలో ఖచ్చితంగా సగ్గుబియ్యం కూడా ఒకటి. సగ్గుబియ్యం గురించి మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది. మన వంట గదిలో కూడా నిత్యం సగ్గుబియ్యం ఉంటూనే ఉంటాయి.


ఇక ఈ సగ్గుబియ్యంలో పొటాషియం,పాస్పరస్,కాల్షియం,ప్రోటీన్స్,కార్బోహైడ్రేట్స్, సోడియం ఇంకా అలాగే ఐరన్ పుష్కలంగా లభిస్తాయి.సగ్గుబియ్యంను ప్రతి రోజు కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటే రక్త కణాల సంఖ్య బాగా పెరిగి ఐరన్ లోపం కూడా తగ్గుతుంది.అలాగే సగ్గుబియ్యం శరీరంలోని వేడిని కూడా ఈజీగా తగ్గిస్తుంది.సగ్గుబియ్యాన్ని పాలలో లేదా నీటిలో ఉడికించి బెల్లం లేదంటే పంచదార కలుపుకుని  కూడా తినవచ్చు.అలాగే సగ్గు బియ్యాన్ని కాసేపు ఉడికించి దానిలో మజ్జిగ ఇంకా అలాగే కాస్త ఉప్పు వేసి కూడా తాగితే చలవ అనేది చేస్తుంది.ఇక ఈ వేసవిలో సగ్గుబియ్యాన్ని తీసుకుంటే మరి మంచిది. శరీరంలోని వేడి తగ్గి నీరసం ఇంకా అలసట తగ్గిపోతాయి.డయాబెటిస్ ఉన్నవారు కూడా సగ్గుబియ్యాన్ని కూడా తీసుకోవచ్చు. ఇది రక్తంలో చెక్కర స్థాయిని బాగా తగ్గిస్తుంది. అలాగే మోకాళ్ళ నొప్పులు ఇంకా కీళ్ల నొప్పులు ఉన్నవారికి నొప్పుల నుండి ఉపశమనం కూడా కలుగుతుంది.అలాగే ఎలాంటి జీర్ణ సంబంద సమస్యలు ఉన్నా కూడా సగ్గుబియ్యం తింటే ఇట్టే తొలగిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: