హైదరాబాద్‌: 15 లక్షలకే ఫ్లాట్‌.. మెట్రో స్టేషన్‌ దగ్గరే..?

హైదరాబాద్ లో జీవనం రోజురోజుకూ ఖరీదైపోతోంది. ఓ చిన్న సొంత ఇల్లు కొనుక్కోవడం చాలా మందికి గగనం అవుతోంది. కనీసం అపార్ట్‌మెంట్ అయినా కొనాలన్నా ధరలు 40, 50 లక్షలకు పైనే ఉంటున్నాయి. కాస్త  తక్కువలో కావాలనుకుంటే.. ఔటర్ రింగ్ రోడ్డు దాటి పోవాల్సిందే. కానీ.. ఇప్పుడు నగరంలోనే.. మెట్రో రైల్ స్టేషన్‌ కు దగ్గర్లోనే.. జనావాసాల మధ్యనే కేవలం రూ. 15 లక్షలకే ఫ్లాట్ సొంతం చేసుకునే అవకాశం వచ్చింది. అదెలాగంటారా..?

ఎల్‌బీ నగర్ బండ్లగూడలోని రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్లను ప్రభుత్వం అమ్మకానికి సిద్దం చేసింది. ఫ్లాట్ల లెక్కన విక్రయించాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. ఈ రాజీవ్ సృగృహ ఫ్లాట్లలో మూడు, నాలుగు రకాలుగా ఉన్నాయి. రూ.15 లక్షల నుంచి ధరలు మొదలవుతున్నాయి. ఎల్‌బీ నగర్ బండ్లగూడలో 2500 వరకు స్వగృహ ఫ్లాట్లు ఉన్నాయి. ఇప్పటికే 500 కుటుంబాల వారు ఉంటుండగా మరో 2 వేల ఫ్లాట్ల ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ చదరపు గజానికి కనీస ధర రూ.2700గా ప్రభుత్వం నిర్ణయించింది.  ఈ ధరలో లెక్కేస్తే.. సింగిల్‌ బెడ్‌ రూం అంటే 567 చదరపు అడుగుల ఫ్లాట్‌ రూ.15 లక్షలపైన వరకూ ఉంటుంది.

ఇక 1400 అడుగుల విస్తీర్ణం ఉండే డబుల్‌ బెడ్‌ రూం అయితే.. రూ. 37లక్షలు వరకూ వస్తుంది. 1600 చదరపు అడుగులు ఉండే  త్రిబుల్‌ బెడ్‌ రూం రూ.43 లక్షల వరకూ ధర పలకొచ్చు. ముందు వీటిని ప్రభుత్వ ఉద్యోగులు, అవుట్‌సోర్సింగ్‌ సిబ్బందికి అమ్మాలని  ప్రభుత్వం భావిస్తోంది. ఎల్‌బీ నగర్ బండ్లగూడలోనే కాకుండా పోచారం మున్సిపాలిటీ పరిధిలో సద్భావన్‌ కాలనీలోనూ స్వగృహ  ఫ్లాట్లు ఉన్నాయి.

బండ్ల గూడ ఇప్పుడు బాగా బీజీ ప్రాంతంగా మారింది. నాగోల్‌లో మెట్రో రైలు ప్రాజెక్టు ప్రారంభం అయ్యాక.. ఈ ప్రాంతం రూపు రేఖలు మారిపోయాయి. చదరపు గజానికి రూ. 2700 అంటే మంచి ధరగానే చెప్పుకోవచ్చు. అయితే.. ఈ భవనాలు ఎప్పటి నుంచో ఖాళీగా ఉంటున్నాయి. కట్టి కూడా పదేళ్లు దాటుతోంది. అలాగే ఇప్పటికే ఈ భవనాల్లో ఉంటున్నారు కొన్ని సమస్యలు చెబుతున్నారు. అందుకే కొనే ఆలోచనన ఉన్నవారు అన్నీ ఆలోచించుకుని ముందడగు వేయడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: