వాటి పేరు వెనుక ఉన్న కథ -2


1. డెన్మార్క్ కు చెందిన ఇద్దరు ఇంజినీర్లు హెన్నింగ్ హాల్క్ లార్సెన్, సొరేన్ క్రిస్టియన్ టర్బో లు దేశానికి స్వాతంత్య్రం రాకముందే భారతదేశానికి వచ్చి దేశంలోని పరిశ్రమలకు అవసరమైన ఇంజినీరింగ్ సేవలు అందించడానికి 1938లో ముంబై వచ్చి తమ ఇంటి పేర్లయిన లార్సెన్ , టర్బో లను కలిపి లార్సెన్ అండ్ టర్బో సంస్థ గా ఏర్పాటు చేశారు. దీన్నే మనం ప్రస్తుతం ఎల్ అండ్ టీ గా వ్యవహరిస్తున్నాం. ప్రస్తుతం ఈ సంస్థ కింద పలు వ్యాపారాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉంది. 




2. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్ గేట్స్ ప్రారంభించిన కంపెనీ 1970,80 ల్లో బాగా ప్రాచుర్యం పొందిన మైక్రో కంప్యూటర్లకు సాఫ్ట్ వేర్ ను తయారు చేసింది. ఆ తర్వాత కంపెనీ కి ఒక పేరు అవసరం ఏర్పడింది. అప్పుడు మైక్రో కంప్యూటర్స్ లో మైక్రో నీ , సాఫ్ట్ వేర్ లో సాఫ్ట్ ని తీసుకొని మైక్రోసాఫ్ట్ గా నామకరణం చేశాడు. సాఫ్ట్ వేర్ భవిష్యత్ గురించి అవగాహన ఉండి పెట్టారో లేదో గాని అప్పటి నుంచి ఇప్పటి వరకూ సాఫ్ట్ వేర్ రంగంలో రారాజుగా ఎదిగింది. 



3. కంప్యూటర్ హార్డ్ వేర్ , సాఫ్ట్ వేర్ సేవల్ని అందించే సన్ మైక్రో సిస్టమ్స్ లో సన్ అనే పదం స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ నెట్వర్క్ కి సంక్షిప్త రూపం. ఈ సంస్థ వ్యవస్థాపకులు ఆండీ , వినోద్ ఖోస్లా , స్కాట్ మెక్ నీలే లు కలుసుకున్నది కూడా స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ లోనే. జావా లాంగ్వేజ్ ని అభివృద్ధి చేసింది వీరే. 




4. ఇంటెల్ సహ వ్యవస్థాపకులు బాబ్ నాయ్స్, గోర్డాన్ మూరె తమ కొత్త కంప్యూటర్స్ సంస్థకు ప్రముఖ కంపెనీ హెచ్ పి మాదిరిగా ఏం అండ్ ఎన్ పేరు పెడదమనుకున్నారు. కానీ అప్పటికే ఒక ప్రముఖ హోటళ్ల కంపెనీ ఆ పేరుని నమోదు చేసుకోవడంతో వారు మరో పేరు వెత్తుకోవాల్సి వచ్చింది. అప్పుడు ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రానిక్స్ కి సంక్షిప్త రూపంగా ఇంటెల్ పెట్టారు. 

ఇలా ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పలు కంపెనీల పేర్ల వెనుక ఏంతో చరిత్ర ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: