లైఫ్ స్టైల్ : బిర్యానీ ఆకుతో చర్మ సౌందర్యం.. ఎలా అంటే..?

Divya
సాధారణంగా బిర్యానీ వంటి వంటకాలు తయారు చేసేటప్పుడు తప్పకుండా బిర్యానీ ఆకులు ఉపయోగిస్తారు.. అయితే వీటిని ఉపయోగించడం వల్ల జీర్ణక్రియ సరిగ్గా పని చేయడంతోపాటు జుట్టు చర్మ సమస్యల నుండి కూడా బయటపడడానికి ఈ బిర్యానీ ఆకు చాలా బాగా పనిచేస్తుంది.. బిర్యానీ ఆకుల వల్ల మనకు కలిగే ఆరోగ్య సమస్యలను దూరం చేయడంలో చాలా చక్కగా బిర్యానీ ఆకులు పనిచేస్తాయి.. ముఖ్యంగా పలావు ఆకులు ఎక్కువగా టమాటా బాత్, రైస్ బాత్ లతో పాటు బిర్యాని , పలావ్ వంటి వాటిలో ఎక్కువగా ఉపయోగిస్తారు..
ఇక దీనిని బే లీఫ్ అని కూడా పిలుస్తూ ఉంటారు.. ఇకపోతే ఈ ఆకులు మన ఆరోగ్యానికి తగినన్ని పోషకాలు అందించడంతో పాటు పరోక్షంగా కూడా సహాయపడతాయి.. వంటలకు సువాసనభరితంగా రుచిని అందిస్తాయి.. ఈ ఆకులలో  నాలుకకు ఉపశమన గుణాలు ఉంటాయి. ముఖ్యంగా పలావ్ ఆకు ను ప్రపంచంలోని ఎన్నో ప్రాంతాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. మెక్సికో,  ఇండోనేషియా తోపాటు పాశ్చాత్య దేశాలలో సాంప్రదాయ వంటలలో ఎక్కువగా ఉపయోగిస్తారు.
ఇకపోతే పలావ్ ఆకులను తల స్నానం చేసేటప్పుడు పొడిగా చేసి నీటిలో నానబెట్టి స్నానం చేసేటప్పుడు ఉపయోగిస్తే మంచి క్రీంలాగా పనిచేస్తాయి.. చర్మ సమస్యలతో బాధపడుతున్నారు బిర్యానీ ఆకుల పొడిని ఒక టేబుల్ స్పూన్ తీసుకుని,  రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, అర టేబుల్ స్పూన్ తేనె, కొద్దిగా పసుపు వేసి బాగా పేస్ట్ చేయాలి. దీనిని ముఖానికి పట్టించి ఆ తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు తీసుకుంటే చర్మ సమస్యల నుంచి ఉపశమనం లభించడం తో పాటు ముఖం కాంతివంతంగా తయారవుతుంది.

జుట్టు సమస్యలను కూడా దూరం చేయడంలో ఈ బిర్యానీ ఆకులు చాలా చక్కగా పనిచేస్తాయి. బిర్యానీ ఆకులను లైట్ గా కడిగి అరలీటరు నీటిలో ఉడకబెట్టాలి. దీనిని వడకట్టి తల స్నానం చేసేటప్పుడు జుట్టు పై అప్లై చేస్తే జుట్టు మెరుస్తూ నిగనిగలాడుతూ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: