68 ఏళ్లుగా కంపెనీలో ఉద్యోగం... ఒక్క సెలవు పెట్టలేదట

VAMSI
ఎక్కువ మంది ఉద్యోగాలు చేస్తూ బ్రతుకు బండిని నడిపిస్తున్నారు. వారానికో లీవ్ (సండే), పండగకి, పబ్బానికి, జాతీయ సెలవులు అని మధ్య మధ్యలో కాస్త ఊరట పొందటానికి సెలవులు వస్తుంటాయి. ఇవి కాకుండా మనిషన్న తర్వాత ఆరోగ్యం పాడవకుండ ఉంటుందా..ఆరోగ్యం సరిగా లేనప్పుడు ఉద్యోగానికి సెలవు పెట్టకుండా ఉంటామా, కొంతమందైతే నెలకొకసారి అయినా ఆరోగ్యం బాగోలేదని చెప్పి లీవు తీసుకుని తమ పనులు కానిస్తుంటారు. జీవితం లో చాలా మంది ఇలాంటి పనులు చేసే ఉంటారు. ఇది మన రెగ్యులర్ లైఫ్. అయితే ఇపుడు ఓ ఉద్యోగి గురించి చెబితే ఖచ్చితంగా అందరూ షాక్ అవుతారు.
అవునండీ ఓ వ్యక్తి సెలవనేదే పెట్టకుండా ఉద్యోగం చేస్తున్నాడు. నెలో, లేక ఏడాదో అనుకునేరు ఏకంగా 68 ఏళ్ల నుండి సెలవనేదే లేకుండా నిర్విరామంగా డ్యూటీ చేస్తూనే ఉన్నారు. ఈ అరుదైన వ్యక్తి అమెరికాలో ఉంటున్నారు. ఇంగ్లాండ్ కి చెందిన బ్రియాన్ కోర్లే అనే వ్యక్తి వయసు ఇప్పటికీ 84 ఇక ఆయన 68 ఏళ్ల ఉద్యోగ జీవితంలో ఒక్క సిక్ లీవ్ కూడా పెట్టలేదు అంటే నమ్ముతారా...?? కానీ ఇదే వాస్తవం, నిజంగా ఈయన 68 ఏళ్ల నుండి పనిచేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఒక సిక్ లీవ్ కూడా పెట్టకుండా ఉద్యోగం చేస్తున్నారు. 1953 సంవత్సరంలో తన 15 ఏళ్ల వయసులో ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు ఒక షూ ఫ్యాక్టరీలో పనికి చేరాడు.
ఇక అలా ఆ ఉద్యోగాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చారు. తనకు 50 ఏళ్లు వచ్చే సరికి ఆ కంపెనీ అవుట్ లెట్ బిజినెస్ చేయడం మొదలుపెట్టింది. అందులోనూ బ్రియాన్ పనిచేస్తూ వస్తున్నారు. అయితే ఒక్కరోజు కూడా నాకు బాగోలేదు సెలవు కావాలని అడిగింది లేదు, సెలవు పెట్టింది లేదు. ఫ్యాక్టరీ అంటే పెద్దగా సెలవులు ఉండవు అయితే ఉన్న వాటితోనే సర్దుకున్నారు, కానీ అస్సలు లీవ్ అనేదే పెట్టలేదట.  అంతా ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందడం నిజంగా ఆ దేవుడి ఇచ్చిన అదృష్టం. పని పట్ల ప్రేమ, నిబద్దత, నిజాయితీ, ఆరోగ్యవంతమైన జీవనశైలి తన కెరీర్ రహస్యం అని చెబుతున్నాడు ఈ పెద్దాయన...నిజంగా బ్రియన్ చాలా గ్రేట్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: