హెరాల్డ్ ఫ్లాష్ 2021 : వీడ్కోలు ఎలా ఉండాలో చెబుతాను! నేను మాత్రమే...!

RATNA KISHORE


ఏడాదంతా క‌ష్టం,దుఃఖం అన్న‌వి ఉద‌య కాల సంత‌ర్ప‌ణ‌లు అయి ఉన్నాయి.జీవితం ఒక్క‌టే ఎక్క‌డో ఓ ద‌గ్గర ఆగిపోయి మ‌న‌ల్ని క‌డివెడు నీళ్ల‌తో స‌రితూస్తుంది.తూకం చెల్లాలి..అర్థం కన్నా,భావం క‌న్నా ఆత్మ‌గ‌తం ఒక‌టి చెల్లాలి. సామ్యం చెల్లాక రాశే ప్ర‌తి మాట నా నుంచి మీ వ‌ర‌కూ ఓ ఉద్ధృతి.ఉద్య‌మ రీతి కూడా!ఏం రాసినా విలక్ష‌ణ శైలి ఆపాదన‌కు కాదు అనువ‌ర్త‌న‌కు నోచుకున్న చోటు కాలం న‌న్ను చూసి పొంగిపోవాలి..నేను మాత్ర‌మే అనుకోవ‌డంలో గ‌ర్వం ఉంది.ఈ ఏడాది నాకు ఆ గ‌ర్వం ఇచ్చింది.ఇక్క‌డ గ‌ర్వం పౌర పుర‌స్కారం..మీరు మాత్ర‌మే నిలువ‌రించ‌గ‌ల‌రు అని ఎవ్వ‌రు అన్నా పొంగిపోయాను నేను..మ‌నుషుల్లో అరాచ‌కం ఎంతున్నా దానిని నిలువ‌రించే శ‌క్తి అక్ష‌రానికి ఉంది క‌దా!క‌నుక రాయడంలో ఉన్న బాధ్య‌త‌ను మ‌రింత ప్రోత్స‌హించే గుణం త‌ప్ప‌క ఉండాలి.




కాలం న‌న్నొక ఓట‌మి చిత్తం చెంత చేర్పించి..నాయ‌కులు వ‌చ్చి నిల‌దీయ‌డం ఆరంభిస్తే నేను ప్ర‌శ్నించ‌డం ప్రాభవ రీతిన అల‌వ‌ర్చుకున్నాను.అవును!ఇదే కదా మ‌నం చేయాల్సింది..మీ అమ్మగారు,నాన్న గారు ఇవి నేర్పారా?అని అంటారు..అవును! జీవితం ఎక్క‌డో ఒక ద‌గ్గ‌ర దుర్మార్గాన్ని గుర్తించింది..అన్యాయాన్ని గుర్తించింది..ఇవ‌న్నీ వ‌ద్దు అన్న ప్ర‌తిసారీ నా గొంతు  నా మాట విన‌దు..అవును!అత‌ను మన మాట విన‌రు..అని అన్నారెవ‌రో!న‌న్ను ఉద్దేశించి!ఇది క‌దా మ‌న‌కు కావాలి.హృద‌య‌గతం అయిన రాత..జీవితాన్నో గొప్ప సంస్క‌ర‌ణ వాదం వైపు న‌డిపించి న‌న్ను గెలిపించింది. ఇవాళ రాస్తున్నానొక మార్నింగ్ రాగా...



ఓ బ‌డికి పోయాను..నాలుగంటే నాలుగు మాట‌లు చెప్పాను..ఇంటి ఎదుట ఒక అంబులెన్స్ సాయం అంటూ వ‌చ్చింది..చేసి పంపాక ఇంకొంద‌రి ద‌యామ‌యుల దీవెనలు అందుకున్నాను..ఓ షెల్ట‌ర్ జోన్..కు సాయం చేయాలి..జేబులో డ‌బ్బులు లేవు.. కానీ చేయాల‌న్న సంక‌ల్పం ద‌గ్గ‌ర ఏనాడూ ఓడిపోలేదు..అనుకున్నాను నేను..నా..దాతృత్వం అన్న‌ది చిన్న‌దా?పెద్ద‌దా? అని!కానీ అంత‌లోనే ఒక్క‌టే నిర్ణ‌యించుకుని చెప్పాను మీరు నా పేరు కానీ నా స్నేహితుల పేరు కానీ చెప్ప‌వ‌ద్దు అని విన్న‌వించాను.. కనుక ఈ క్రిస్మ‌స్ నాకో కొత్త జీవితాన్ని ఇచ్చింది.మ‌రింద‌రికి  సాయం చేయాలి నీవు అని ప్ర‌భు బోధ విని పొంగిపోయాను..ఊళ్లో పాస్ట‌ర్ ఎదురు వచ్చి దీవెనలు అందించి వెళ్లారు. స‌ర్!ఈ నాయ‌కుల్లో వ‌చ్చే మార్పునకు  నేను మాత్ర‌మే కార‌ణం కావాలి అని అనుకుంటూ వెళ్లాను.




విషాదాన్ని కానుక‌గా చేసిన కాలంలో నేనున్నాను. మీరున్నారు. మ‌నుషుల‌కు వ‌ర‌ద ఉద్ధృతిని ప‌రిచ‌యం చేసి మృత్యువును వ‌రంగా మార్చిన కాలంలోనూ నేనున్నాను.అవును!రెండు తీవ్ర తుఫానులు మా జీవితాల‌ను ఏడాది కాలంలో అత‌లాకుత‌లం చేశాయి..విల‌యాన్ని ప్ర‌శ్నించ‌డం చేత‌గాక అలానే ఉండిపోయాం..గులాబ్ తుఫాను వెళ్లిపోయాక వెత‌లు మిగిలిన రైతు క‌ళ్లెదుట నిలిచి రంగు మారిన ధ్యానం చేతిలో ఉంచి క‌న్నీళ్లు పెట్టాడు..జ‌వాద్ తుఫాను కూడా చెట్టంత ధైర్యాన్ని ఇంటి ముంద‌ర కూల్చి, కూక‌టి వేళ్ల‌తో పెక‌ళించి మాకో విషాదాన్ని కానుక‌గానే ఇచ్చింది..అయినా నేను మాత్ర‌మే గెలిచి నిలిచాను..తుఫాను చిత్తాల‌ను వ‌ద్ద‌నుకుని మళ్లీ నా శ్రీకాకుళం కొత్త శ్వాస‌తో జీవితాన్ని ఆరంభిస్తుంది..ప్రారంభం అప‌స‌వ్య‌త నుంచి సవ్య‌త వైపు..అసందిగ్ధ‌త నుంచి సందిగ్ధ‌త వైపు..ఇవి క‌దా కావాలి..వీడ్కోలు ఇలానే ఉండాలి.




కాలం ఇవాళ మంచు సోనల న‌డుమ ప్రేమ క‌బుర్లే చెబుతోంది. ప్రేమ క‌థ‌లే విన్న‌విస్తుంది..అని రాశానా..అవును!నా దృష్టిలో ప్రేమ అంటే ప్రార్థ‌న అని..కాలానికి చేసే ప్రార్థన..అనువైన కాలం కోసం చేసే ఆవాహ‌న అని కూడా అనొచ్చు..ఏం కాదు కొత్త ఏడాది బాధ్య‌త‌ల‌ను ఓట‌ముల‌ను రెంటినీ స్వీక‌రించే గుణాన్ని అందిస్తే చాలు..జీవితం మ‌రింత వేగాన్ని అందుకుంటుంది..ప‌రుగులో గాయాల‌ను ప్రేమించ‌డంలోనే ఆనందం ఉంది..ఓడిపోయానా నేను..నా ద‌గ్గ‌ర ఈ కాల‌మ‌నే ఓ పెద్ద నోరు ఏమ‌యి ఉంటుంది అని అనుకుంటూ చ‌దువుకుంటూ మ‌రో మారు త్వ‌మేవాహ‌మ్ అని చెప్ప‌డం ఆరుద్ర నేర్పాడు..డు కాదు రు..అదే చెప్పాను నేను..ఇవాళ పునఃశ్చ‌ర‌ణ, పునఃస్మ‌ర‌ణ రీతిలో..చ‌దువరి జ్ఞాప‌కం సందిగ్ధ‌త‌ల‌కు ఆవ‌ల..కాలం చివ‌ర మ‌నిషి..వేద‌న చివ‌ర దేశం..ఒక‌టి వెల్లువ‌కు ఆస్కారం..కాంతికి తోడు..ప్రక్రియా రీతికి ఆలంబన..నేను మాత్ర‌మే!




ఏమ‌యినా గ‌డిచిన కాలంలో వివాదాలున్నాయి. తీవ్ర తుఫానులు ఉన్నాయి. వీటిని దాట‌లేని అసక్త‌త కానీ అస‌మ‌ర్థ‌త కానీ మ‌న‌లోనే ఉంది. మ‌నం అన‌గా మ‌న ప్ర‌భుత్వాల్లో..మనం అన‌గా మ‌న‌నం చేయ‌ద‌గ్గ విష‌యాల్లో! నేను మాత్ర‌మే... వీడ్కోలు ఎలా ఉండాలి అంటే.. విన‌మ్ర చిత్తం అన్న‌ది ఉండ‌కూడ‌దు..తిరుగుబాటు ఉండాలి..య‌వ్వ‌నం ఇచ్చిన అతి వాదం నేను అని ఒక‌రు అన్నారు (శివ అనే నా త‌మ్ముడు, జ‌ర్న‌లిస్టు) అవును! ఆ విధంగానే ఉండాలి. వీడ్కోలు అవ‌ధిని చెరిపి గొప్ప ఊహ‌కు ప్ర‌తిపాద‌న అయి ఉంటే మేలు..అలాంటి మేలును ప్రేమించ‌డ‌మే ఇప్ప‌టి నీ మ‌రియు నా క‌ర్త‌వ్యం.అంద‌రికీ అప్పుడే కొత్త కాలపు ఆహ్వానాలు అందాల‌ని వేడుకుంటూ..



- ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: