హ్యాపీ క్రిస్మ‌స్ : ప్ర‌భు త‌త్వం ఏం నేర్పుతుందంటే?

RATNA KISHORE
ప్ర‌త్యేకించిన ఆలోచ‌న ఉన్న‌తుడ్ని చేస్తుంది అని ఓ ఫాద‌ర్ అంటున్నారు. దేశాన్ని న‌డిపేందుకు ప్ర‌త్యేకించిన ఆలోచ‌నాప‌రులు మాత్ర‌మే మంచి సందేశం ఇస్తార‌ని బైబిల్ ప్ర‌బోధ‌కులు చెబుతున్నారు. దేశాన్ని పీడించేవి వ‌ద్ద‌నుకుని సంస్క‌రించే గుణం ప్ర‌త్యేకం అయితే అప్పుడు మాత్ర‌మే మాన‌వ ప్ర‌గ‌తి ఒకటి త్వ‌రిత‌గ‌తిన నిర్విరామ పురోగ‌తిని పొంద‌డం సాధ్యం. క్రిస్మ‌స్ వేడుక‌లో ప్ర‌భువుకు చేసే ప్రార్థ‌న‌లో కొత్త ఊహ‌కు ప్ర‌తిపాద‌న ఇవ్వండి..ప్రేమ పెరిగిన చోటు మ‌నిషి ఓ కొత్త ఊహ‌కు ఆలంబ‌న. కొవ్వొత్తి వెలుగు ఊహా స్రవంతిని వ్యాప్తితం చేస్తుంది. ప్ర‌తి ఊహా మంచి అన‌ద‌గ్గ ప‌రిణామాల‌కు కార‌ణం అయి ఉండాలి. దేవుడి  ఆలోచ‌న శ్రేయోదాయ‌కం అన్న‌ది బైబిల్ మాట..శ్రేయోదాయ‌కం అయిన‌వే ప్రేమ ధార‌ల‌కు సంకేతం అవ్వాలి. అటువంటి చోటు పేద‌రికం ఉండ‌దు..వెనుకు బాటుకు అది ప్ర‌థ‌మ కార‌ణం అయి ఉండ‌దు. వెలుగు ప్ర‌థ‌మ క‌ర్తవ్య బోధ మాత్ర‌మే చేసి వెళ్తుంది. క్రీస్తు రాక‌తో మ‌న జీవితం కాంతిమంతం...


మ‌నుషులంతా త‌మ‌ని తాము త‌గ్గించుకుని ఉండాలి అని నేర్పారు ఏసు..విశ్వ వ్యాప్త ప్రేమ‌కు సంకేతిక ఈ పండుగ కావాలి అని నిర్వ‌చ‌నం ఒక‌టి చ‌ర్చి వాకిట వినాల‌ని ఉద్బోధించారు ఏసు. మ‌నం ఎక్క‌డో ఓ చోట ఆగిపోయి ప్రేమ కోసం అర్రులు చాచ‌డం త‌ప్పు కాదు. విశ్వ వ్యాప్త ప్రేమ నుంచి మ‌నుషులు పొందే ఏక‌త్వాన్ని లేదా ఏక‌త‌ను అంతా పొంద‌గ‌ల‌గాలి. కొవ్వొత్తుల వెలుగుల్లో గ‌దినిండా ప‌రుచుకున్న కొన్ని బైబిల్ వాక్యాలు లోప‌లి ప్ర‌పంచంలో నిక్షిప్తం అయితే జీవితం అక్క‌డి నుంచి చేసే ఓ ప్ర‌యాణం నిన్నటి క‌న్నా కాస్త భిన్నం. అభాగ్యుల‌ను చ‌ర్చి ఆదరిస్తుంది. సమాద‌రిస్తుంది. నిర్భాగ్యుల‌కే కాదు ఎందరో చిన్నారుల‌కు చ‌ర్చి అమ్మానాన్నా అయి ఉంటుంది. అనాథ‌ల‌కు చ‌ర్చి అమ్మా నాన్నా అయి ఉంటుంది అని గుర్తించాలి..సేవ‌కూ ప్రేమ‌కూ మ‌ధ్య ఒక వార‌ధిని నిర్మించే క్ర‌మాన జీవితం మ‌రో కొత్త అవ‌లోకనాన్ని పొందాలి.


శ‌త్రువులు ఎవ్వ‌రూ ఉండ‌రు. ద్వేషం ఒక్క‌టి లోప‌ల దాగి బ‌య‌ట విషం చిమ్మ‌నిస్తుంది. చెమ్మ‌గిల్లే క‌ళ్లు మాత్రం వాటిని ప‌రిష్క‌రించ‌మ‌నే కోరుతాయి. ద్వేషాన్ని ప‌రిష్క‌రించ‌డ‌మే ప్రేమమ‌య జీవితానికో కొల‌మానం అని గుర్తించాలి ప్ర‌తి ఒక్క‌రూ..ద్వేషాన్ని వ‌దిలిపోవ‌డం వ‌ద్ద‌నుకోవ‌డం అన్న‌వి ఓ గొప్ప ప‌రివ‌ర్త‌న గుణకాలు అని గుర్తించాలి ప్రేమించాలి అంద‌రూ.. కొవ్వొత్తి వెలుగు పేద‌లది కొవ్వొత్తి వెలుగుకు కార‌ణం అయిన ఒక గొప్ప సంస్క‌ర‌ణ మ‌నంద‌రిదీ..చీక‌టి ఒక్క‌రిదే కాదు అంద‌రికీ కూడా వ‌ర్తిస్తుంది..వెలుగు ఒక్క‌చోటే ఆగిపోయి అంద‌రినీ పంచుకోమ‌ని చెప్పి వెళ్తుంది..పంచుకున్న వెలుగును పెంపొందించేదే ప్రేమ..ద్వేషం మాత్రం ఆ చీక‌టి లాంటిదే.. క‌రుణ వెలుగు క‌ల‌త చీక‌టి.. ఆక‌లి కూడా అలాంటిదే! దేనిని నీవు వ‌ద్ద‌నుకుంటున్నావు అన్న‌ది  నీ నిర్దేశం. అంద‌రికీ హ్యాపీ క్రిస్మ‌స్ ...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: