నార్త్ ఇండియాలో వింటర్ వెకేషన్... ఈ 5 ప్రాంతాలే టాప్

Vimalatha
చలికాలంలో ఇష్టమైన వారితో కలిసి అలా పచ్చటి ప్రకృతిలో ఉదయం లేదా సాయంత్రం నడిస్తే... ఆహా అదొక అద్భుతమైన డ్రీం కదా. దీని కోసమే చాలా మంది చలి కాలం కోసం వేచి చూస్తారు. భారతదేశంలోని అనేక ప్రాంతాలలో శీతాకాలం నవంబర్ నెల నుండి ప్రారంభమవుతుంది. అలాంటప్పుడు శీతాకాలంలో ట్రిప్ ప్లాన్ చేసుకునే వాళ్ళు కోసం ఉత్తర భారతదేశం లోని కొన్ని ఉత్తమ ప్రదేశాల గురించి తెలుసుకోవాల్సిందే. ఈ ప్రదేశాలు వేసవిలో అందంగా కనిపిస్తాయి, కానీ శీతాకాలంలో ఇక్కడి దృశ్యం మంత్రముగ్దులను చేస్తుంది. మీరు మీ కుటుంబ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో కలిసి ఈ పర్యాటక ప్రదేశాలను సందర్శించడానికి ప్లాన్ చేసుకోవచ్చు.
ఆగ్రా
ఆగ్రా తాజ్ మహల్ కు ప్రసిద్ధి అన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ఏడాది పొడవునా పర్యాటకులను ఆకర్షించే ప్రదేశాలలో ఇది కూడా టాప్ లో ఉంటుంది. చలి కాలంలో ఇక్కడ సందర్శిస్తే అదొక థ్రిల్. ఇదొక చారిత్రక నగరం. మొఘలుల పాలన ఇక్కడ ఎక్కువగా ఉంది కాబట్టి మొఘలులు ఇక్కడ చాలా భవనాలు నిర్మించారు.
జైపూర్
శీతాకాలంలో ఉత్తర భారతదేశంలోని జైపూర్ సందర్శించడానికి కూడా ప్లాన్ చేసుకోవచ్చు. జైపూర్‌ని పింక్ సిటీ అని కూడా అంటారు. ఆహ్లాదకరమైన శీతాకాలపు ఎండలో దాని వారసత్వం రాయల్టీని అనుభవించవచ్చు. ఈ చారిత్రక ప్రదేశం పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. మీరు గొప్ప జైన దేవాలయాలు, కోటల గొప్పతనాన్ని రాజరిక అనుభవాన్ని పొందవచ్చు.
శ్రీనగర్
శ్రీనగర్ భూమిపై స్వర్గం లాంటిది. ఈ ప్రదేశం అందాలను అనుభవించడానికి ప్రజలు ఇక్కడకు సందర్శిస్తారు. దాని సహజమైన మెరిసే దాల్ సరస్సు, అందమైన తోటలు, సహజ సౌందర్యం మిమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తాయి. ఇది భారతదేశంలోని ఉత్తమ శీతాకాలపు గమ్యస్థానాలలో ఒకటి. శీతాకాలంలో హిమపాతాన్ని ఆస్వాదించడానికి డిసెంబర్, జనవరి నెలల్లో ఈ ప్రదేశాన్ని సందర్శించవచ్చు.
జైసల్మేర్
ఇది ప్రసిద్ధ శీతాకాల విడిది. జైసల్మేర్‌ను గోల్డెన్ సిటీ అని కూడా అంటారు. ఇది థార్ ఎడారి మధ్యలో ఉంది. పట్వోన్ కి హవేలీ, సోనార్ కోట, జైన దేవాలయం ఈ ప్రదేశంలోని కొన్ని ప్రధాన ఆకర్షణలు. జైసల్మేర్ కోట రాజస్థానీ శిల్పకళకు చిహ్నం.
ధర్మశాల
హిమాచల్‌లోని ధౌలాధర్ శ్రేణుల మధ్య ఉన్న ధర్మశాల ఒక ఇష్టమైన ప్రదేశం. ఈ సుందరమైన హిల్ స్టేషన్ మీకు ఇండో-టిబెటన్ సంస్కృతి ఏకైక సంగమాన్ని అందిస్తుంది. మీరు శీతాకాలంలో ఉత్తర భారతదేశాన్ని సందర్శించాలని ప్లాన్ చేస్తుంటే, మీరు ధర్మశాలను సందర్శించడానికి కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది శాంతిని కోరుకునే వారికి, ట్రెక్కింగ్‌కు గొప్ప ప్రదేశం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: