ఫ్రిడ్జ్ లో పెట్టిన కూరగాయలు, ఆహార పదార్ధాలు నిల్వ ఉండాలంటే..??

Suma Kallamadi
ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా కూరగాయలను ఒక్కసారిగా తెచ్చుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని నిల్వ చేసుకుంటున్నారు. అయితే బయట మార్కెట్లో తెచ్చుకున్న కూరగాయలు,  ఆహార పదార్థాలు పాడవకుండా ఎక్కువ కాలం ఎలా నిల్వ చేసుకోవాలో ఒకసారి తెలుసుకుందాం.. !!టమాటాలు, వెల్లుల్లి, ఉల్లిపాయలు, బంగాళా దుంపలను ఫ్రిజ్ లో మాత్రం పెట్టకూడదు.సూర్య కాంతి పడకుండా గది ఉష్ణోగ్రత వద్ద వీటిని ఉంచితే ఎక్కువ కాలం తాజాగా నిల్వ ఉంటాయి.పాల ప్యాకెట్లు లేదా పచ్చి పాలు డబ్బాలో వేసి డీప్ ఫ్రిజ్ లో భద్రపరిస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.ఎప్పుడు కావాలంటే అప్పుడు  పాలను తీసి వాడుకోవచ్చు. వేడి ఆహార పదార్థాలు అయితే మొదట చల్లార్చిన తర్వాతే ఫ్రిజ్ చేయాలి.



ఒక వేళ ఆహార పదార్థం వేడిగా ఉంటే దాని ఉష్ణోగ్రత వల్ల మిగతా పదార్థాలు పాడయ్యే ప్రమాదం ఉంది.ఏ ఆహార పదార్థాలు అయినా ఫ్రీజర్ లో భద్రపరిచే ముందు గట్టిగా మూత ఉండే డబ్బాల్లో పెట్టి పెట్టుకోవాలి.అలాగే మాంసం లేదా చేపలు, రొయ్యలు లాంటి కూరలు కూడ మొదట వేడి చేసి చల్లార్చిన తర్వాతే ఫ్రీజ్ లో ఉంచాలి.అలాగే వాటిని మూత ఉన్న డబ్బాలో పెట్టి డీప్ ఫ్రిజ్ లో నిల్వ ఉంచితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.కాని పచ్చి మాంసం లేదా చేపలు రొయ్యలు వీటిని రెండు రోజులు లేదా మూడు రోజుల కంటే ఎక్కువ రోజులు ఫ్రిజ్ లో నిల్వ ఉంచి వాడకూడదు.

తురిమిన చీజ్ ను కొద్ది కొద్దిగా మఫిన్స్ లో వేసుకొని ఫ్రీజర్ లో నిల్వ చేసుకోవచ్చు.పెరుగును కూడా ఇలాగే నిల్వ చేసుకోవచ్చు.



పచ్చళ్ళుగా మాంసం, దోసకాయ,టమాటా, నిమ్మకాయ,కాలీఫ్లవర్ మామిడి కాయ, బీట్రూట్, వీటిని వెనిగర్ లేదా నిమ్మరసం మెంతి పొడి కలిపి ఎక్కువ నూనె ఉప్పు లేకుండా పచ్చళ్ళుగా తయారు చేసుకొని ఫ్రీజ్ లో ఉంచితే ఎక్కువ కాలం పాటు నిల్వ చేసుకోవచ్చు.

బంగాళా దుంపలను సన్నటి చిప్స్ లా కోసి బాగా మరిగే నీటిలో అర నిమిషం పాటు ముంచి తీయాలి.ఆ తరువాత చల్లార్చి కాస్తంత నూనె రాసి డబ్బలో ఉంచి ఫ్రీజర్ లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.మనకు కావలసిన అప్పుడల్లా చిప్స్ లా తయారు చేసుకుని పిల్లలకు పెట్టవచ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: