మీ పిల్లలు బరువు తక్కువ ఉన్నారా... చింతించకండి ?

VAMSI
ఒక మనిషి జీవితంలో ఎంత సంపాదించినా ? ఎంత పోగొట్టుకున్నా ? కుటుంబం అనేది లేకపోతే అంతా వ్యర్థమే. డబ్బున్న లేకపోయినా భార్య పిల్లలు ఇదే కదా మనకు ఆస్తి. ప్రతి మనిషి కూడా వీటిని పొందడానికి ప్రయత్నిస్తారు. అయితే కొందరు తల్లితండ్రులు మాత్రం తమ పిల్లల విషయంలో ఆలోచిస్తూ ఉంటారు. ఇవి రకరకాలుగా ఉంటాయి... మా పిల్లలకు వయసు పెరుగుతోంది... కానీ అందుకు తగిన బరువు లేరు, పొడవుగా లేరు అంటూ బాధపడుతూ ఉంటారు. అయితే దీనికి ప్రధాన కారణం ఏమిటంటే... ఆహారం సరిగా తీసుకోకపోవడమే. అంతే కాకుండా కొన్ని సమయాలలో తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం కూడా కారణం అవుతుంది. అయితే ఇలా వయస్సుకు తగిన బరువు మరియు పొడవు లేని సమయంలో ఆ భారం వారి మనకిక ఆరోగ్యంపై కూడా పడుతుందని మనకిక వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఇలా జరగకుండా ఉండాలంటే ఎటువంటి ఆహారాన్ని ఆ పిల్లలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
ఈ ఆహారంలో గుడ్లు, చికెన్, తేనె, ఓట్స్, బీన్స్, అరటిపండు, పప్పు ధాన్యాలు వంటివి మీ పిల్లలు తినే ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. అయితే ప్రతి రోజూ గుడ్డునే తినిపించకుండా... ఒకరోజు గుడ్డు మరుసటి రోజు చికెన్ ను ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. కాగా నిద్ర లేచిన తరువాత తేనెను తినిపించడం కూడా మంచిది. మరియు ఓట్స్ తో ఊతప్పం లాంటివి పెట్టాలి. బీన్స్ తో తాలింపు, పప్పు ధాన్యాలతో కూరలు చేసి పెట్టడం మంచిది.
కాగా శరీర బరువును పెంచడంలో ఉపయోగపడే అవకాడో ఫ్రూట్, బంగాళా దుంపలు, మొక్క జొన్నలు కూడా ఆహారంలో భాగం చేయాలి. ఇంకా పిల్లల శరీరానికి విటమిన్ సి, ఈ, కె, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు వంటివి దొరికే ఆహారాన్ని ఇవ్వాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: