చిన్నపిల్లల చర్మం విషయంలో ఈ పొరపాట్లు చేస్తున్నారా?

VAMSI
పసిపిల్లల విషయంలో ప్రతీది చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వారి చర్మం విషయంలో ప్రత్యేక దృష్టి అవసరం. ఎందుకంటే చిన్నారుల చర్మం చాలా మృదువుగా , సున్నితంగా ఉంటుంది. అయితే చాలా మంది తల్లితండ్రులు తమ చిన్నారి పిల్లల చర్మం రంగు కోసం, మృదుత్వం కోసం ఎదుటి వారు చెప్పిన సబ్బులు వాడటం లేదా ఫేస్ ప్యాక్ లు సొంతంగా తయారుచేసుకుని వారికి పూయడం వంటివి చేస్తుంటారు. అయితే ఇది ఎంతమాత్రం సురక్షితం కాదు. ఇటువంటి విషయాలలో డాక్టర్ల సలహా చాలా అవసరం. అంతే కాకుండా ఎపుడు హగ్గీలు వేయడం వంటివి చేస్తుంటారు. దీని వలన వారి చర్మం పై రాషేస్ వచ్చే అవకాశం ఉంది. సరైన కేర్ తీసుకోకపోతే క్రాడిల్ క్యాప్‌ అంటే తలపైన చుండ్రులా లేదా మచ్చలు ఏర్పడటం. గుల్లలు, కురుపులు వంటివి రావడం వంటివి వచ్చి స్కిన్ ప్రాబ్లమ్స్‌ వస్తాయి.
అయితే కొన్ని జాగ్రత్తలు, సూచనలు పాటిస్తే ఈ సమస్యలు తలెత్తకుండా చూసుకోవచ్చు.  పిల్లలు పుట్టాక వారం రోజుల వరకు స్నానం చేయంచ కూడదు. తల్లి కడుపులో నుండి ఈ సమాజం లోకి వచ్చినా ఆ చిన్నారికి ఈ వాతావరణంకు అలవాటు పడటానికి కనీసం ఏడు ఎనిమిది రోజులు పైనే పడుతుంది.  ఆ తర్వాత కూడా నెల వరకు రోజూ స్నానం చేయిస్తే పిల్లల చర్మం డ్రైగా, రఫ్‌గా తయారవుతుంది. అందుకే రోజు మార్చి రోజు చేయించి... మధ్యలో గోరు వెచ్చటి నీటితో ఒళ్ళును తుడవడం మంచిది. ఈ నీటిలో కాస్త సోప్ ను అలా కొంచం వేసి... ఆ తరవాత వేరే నీటితో తుడిచి పొడి బట్టతో క్లీన్ చేస్తే చాలు. అలాగే పిల్లల చర్మం త్వరగా తేమను కోల్పోతూ ఉంటుంది. కావున డాక్టర్ సలహా తీసుకొని వాళ్ల చర్మానికి తగిన మాయిశ్చరైజర్‌ రాయటం మంచిది. అందరి పిల్లల చర్మం ఒకేలా ఉండదు కాబట్టి ఈ అంశం గుర్తుంచుకోవాలి.
స్నానం చేయించిన వెంటనే మాయిశ్చరైజర్‌ రాయటం ఉత్తమం. అలాగే ఎవరో చెప్పారని షాంపూలు, సబ్బులు వాడకూడదు. అందరి చర్మం ఒకేలా ఉండదు కాబట్టి మీ పిల్లల చర్మానికి తగ్గట్టు ఏ సోప్, షాంపూ వాడాలి అన్నది డాక్టర్లు సూచిస్తారు.  పిల్లల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి సబ్బు లేదా మాయిశ్చరైజర్ చేసేటప్పుడు చాలా సున్నితంగా పూయాలి. బెస్ట్ ప్రొడక్ట్స్ అని ఏవి పడితే అవి డాక్టర్ల సలహా లేకుండా పిల్లలకు వాడకూడదు.  నిజానికి పిల్లలు పుట్టిన నాలుగైదు నెలల వరకు ఏ సబ్బు వాడక పోయినా పర్వాలేదు. మెత్తటి సున్నిపిండి రాసిన సరిపోతుంది. అలాగే మీ పిల్లలని బయటకు తీసుకు వెళ్లాల్సి వస్తే ఎండ లేదా చలి నుండి రక్షణగా మెత్తటి పలుచటి టవల్ ను మీ చిన్నారికి జాగ్రత్తగా చుట్టి తీసుకు వెళ్ళండి. పిల్లలు మూత్ర విసర్జన ఎక్కువుగా చేస్తున్నారు అని ప్లాస్టిక్ కవర్లు కింద వేయకూడదు. ఇలా చేయడం వలన చర్మం కందిపోవడమే కాకుండా వారి శరీరంలో వేడి పెరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: