కిడ్స్ : పిల్లల కోసం స్పెషల్ గా ఆడియో స్టోరీస్

Vimalatha
కరోనా వైరస్ కారణంగా దేశం మొత్తం ప్రస్తుతం మరోమారు ఆందోళనలో ఉంది. అందరూ ఎక్కువగా ఇళ్లలోనే ఉండడానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అయితే పిల్లలకు మాత్రం ఇదే అతిపెద్ద సమస్య అని చెప్పొచ్చు. కరోనా కారణంగా స్వేచ్ఛగా విహరించే వారి రెక్కలు బంధం వేసినట్టుగా అయ్యింది. ఇప్పుడు వారు ఆడుకోవడానికి బయటకు వెళ్లలేరు లేదా ఇంట్లో తమతో ఆడుకోమని పెద్దలను అడగలేరు. ఇదీ ఇప్పటి పరిస్థితుల్లో పిల్లల అసంతృప్తి ఇదే ఇప్పుడు. బయట ఆదుకునే పరిస్థితి ఏమాత్రం కన్పించడం లేదు. అలాంటప్పుడు వాళ్లకు కథలు చెప్పొచ్చు. కానీ ఎంతసేపని కథలు చెబుతాం. మహా అయితే గంట... ఆ తరువాత మనకీ విసుగే కదా ! అందుకే పిల్లల కోసం ఇప్పుడు ఎన్నో ఆడియో కథలు అందుబాటులోకి వచ్చాయి. కాబట్టి పిల్లలు ఇప్పుడు వాటితో టైమ్ బాగా స్పెండ్ చేయగలరు. ఈ ఆడియో కథనాలు పిల్లలను అలరించడమే కాకుండా కొత్త విషయాలను నేర్చుకోనేలా ప్రోత్సహిస్తాయి. దీనికి సంబంధించి 'మున్నా చచ్చు - చతురై కి కహానియన్' అనే పాడ్‌కాస్ట్ విడుదల అయ్యింది. పిల్లలను అలరించే కథలు ఇందులో చాలానే ఉన్నాయి. పిల్లలు ఈ కథలను వినడంలో బిజీగా ఉండటమే కాకుండా కొత్త, తెలివైన విషయాలను కూడా నేర్చుకోగలుగుతారు.
ఈ సిరీస్‌లో రెండు రకాల కథా సంకలనాలు ఉన్నాయి. మొదటిది మున్నా చాచు తెలివితేటల కథలు, రెండవ ఆల్బమ్ అక్బర్, బీర్బల్ తెలివి కథలను చెబుతుంది.
రెండు ఆల్బమ్‌లు పిల్లల మనస్సుకు పదును పెట్టడంతోపాటు వారిని తెలివిగా, పరిస్థితులను ఎదుర్కోగలిగేలా చేస్తాయి. 'మున్నా చాచు కి చతురై కి కహానియన్' సోనీ మ్యూజిక్ కిడ్స్‌లో ప్రారంభించబడింది. మీరు ఈ సిరీస్‌ని YouTube, google Play Music, Wink Music, Spotify, amazon Prime Music, apple Music, Hungama Music, Gaana.com మరియు jio Saavnలో చూడొచ్చు. ఇక ఆలస్యం దేనికి డౌన్‌లోడ్ చేసి పిల్లలకు కొత్త బహుమతి ఇవ్వండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: