బుడుగు: చిన్నారులకు ఆ ఆహారం పెట్టడం వలన ఎన్ని లాభాలో తెలుసా?

N.ANJI
సాధారణంగా తల్లిదండ్రులు పిల్లల విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఇక పుట్టిన పసిపిల్లలకు ఆరు నెలల వరకు తల్లి పాలు చాలా మంచిది అని వైద్యులు చెబుతుంటారు. అయితే 6 నెలల తర్వాత పిల్లలకు కొద్ది మొత్తంలో ఆహారం అలవాటు చేస్తుంటారు. పిల్లలకు మనం పెట్టె ఆహారం ఏదైనా కానీ చాలా మెత్తగా చేసి పెట్టడం ద్వారా వారిలో ఎటువంటి జీర్ణక్రియ సమస్యలు తలెత్తవు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే పిల్లలకు కచ్చితంగా ఈ పప్పు చారు అన్నం పెట్టాలని చెబుతున్నారు. ఇక పప్పు చారు పెట్టడం ద్వారా పిల్లలలో కలిగే ప్రయోజనాలు ఏంటో ఒకేసారి చూద్దామా.
అయితే పిల్లలకు పప్పు చారు అన్నం తినిపించడం ద్వారా తేలికగా జీర్ణం కావడంతో పాటు, మంచి శక్తిని ఇస్తుందని చెబుతున్నారు. ఇక అందులో ఉన్న విటమిన్లు, పీచు పదార్థాలు, ప్రొటీన్లు పిల్లల పెరుగుదలకు ఉపయోగపడుతాయని తెలిపారు. అంతేకాక.. శారీరక పెరుగుదలకు ఎంతగానో దోహదపడుతాయి. ఇక వీటితో పాటు కొద్దిగా పెసర పప్పు అన్నం బాగా మెత్తగా ఉడికించి పిల్లలకు తినిపించడం ద్వారా తేలికగా జీర్ణం అవ్వడమే కాకుండా మలబద్ధకాన్ని నివారిస్తుందని తెలిపారు. అంతేకాక.. పెసర పప్పును తరచూ పిల్లలకు తినిపించడం ద్వారా రక్తం బాగా వృద్ధి చెందుతుందని అన్నారు.
అంతేకాదు.. చిన్న పిల్లలకు చిరుధాన్యాల మిశ్రమం అనగా రాగులు, కందిపప్పు, బాదం, జీడిపప్పు వీటన్నింటినీ కొద్దిగా వేయించి చల్లారిన తర్వాత అన్నింటినీ కలిపి పొడి కొట్టాలని అన్నారు. ఇక ఆ పొడిలో కొద్దిగా పాలు లేదా నీళ్లు కలుపుకొని పిల్లలకు ఉదయం, సాయంత్రం జావాలాగ తాగించాలని చెబుతున్నారు. ఆలా చేయడం వలన పిల్లలు శారీరకంగా, మానసికంగా పెరుగుదల ఉంటుంది. అంతేకాక.. వారిలో రోగ నిరోధక శక్తిని పెంపొందించి, జ్ఞాపకశక్తి కూడా మెరుగు పడుతుందని చెబుతున్నారు. కొంతమంది పిల్లలు పప్పు తినకపోయినా ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే బాదం పౌడర్, జీడిపప్పు పౌడర్ బాగాచేసి తినిపించాలని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: