చిన్నపిల్లలు ఎన్నిసార్లు స్నానం చేయించాలో తెలుసా..?!

N.ANJI

స్నానం అనేది మానవ శరీరానికి చాలా అవసరం. శరీర అలసటను దూరం చేయడానికి, చర్మం కాంతివంతంగా మెరవడానికి.. దుర్వాసన రాకుండా మనిషి ఆరోగ్యంగా ఉండటానికి స్నానం ఎంతో అవసరం. గోరు వెచ్చటి నీటితో స్నానం చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పలువురు పరిశోధకులు కూడా వెల్లడించారు. బయటికి వెళ్లినప్పుడు వాతావరణంలోని దుమ్ము, ధూళి మన శరీరంపై పడతాయి. అలాగే వైరస్, బ్యాక్టీరియాలు కూడా చేరుతాయి. అందుకే రోజుకి కనీసం రెండు సార్లయినా స్నానం చేయాలని పరిశోధకులు చెబుతుంటారు.


ప్రతిరోజు స్నానం చేయడం వల్ల కొన్ని రకాల వ్యాధుల నుంచి శరీరాన్ని కాపాడుకోగలుగుతాం. సాధారణంగా శరీరంపై ఎన్నో రకాల బ్యాక్టీరియాలు నివాసముంటాయి. వీటి వల్ల చర్మవ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. స్నానం చేయకుండా ఉండటం వల్ల ఈ బ్యాక్టీరియా వృద్ధి చెంది చర్మవ్యాధులు వచ్చే సూచనలు ఎక్కువగా ఉంటాయి. అందుకే తరచూ స్నానం చేస్తూ ఉంటాయి. అయితే పెద్దవాళ్లు స్నానం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించకపోయినా.. చిన్నపిల్లలకు స్నానం చేయించేటప్పుడు తగిన జాగ్రత్తలు, నియమాలు పాటించాలి.


చిన్నపిల్లలకు పెద్దలు రోజూ స్నానం చేయిస్తుంటారు. ఆ సమయంలో చిన్నపిల్లలకు చిరాకుగా అనిపిస్తుంటుంది. అందుకే స్నానం చేయించినంత సేపు ఏడుస్తూనే ఉంటారు. కానీ స్నానం చేసిన తర్వాత వాళ్లుకు అన్నం తినేసి మంచి నిద్రను పొందుతారు. దీంతోపాటుగా చిన్నపిల్లలు డైపర్లు వేయడం ద్వారా బ్యాక్టీరియాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే స్నానం చేయిస్తే ఆరోగ్యంగా ఉంటారని పెద్దవాళ్లు భావిస్తారు. చిన్నపిల్లల చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా స్నానం చేయించాలని నిపుణులు పేర్కొంటున్నారు.


స్నానం చేయించడం వల్ల శరీరంపై మృత కణాలు తొలగిపోతాయని, ఎలాంటి దుర్వాసన రాదని నిపుణులు చెబుతున్నారు. అయితే తరచూ స్నానం చేయించడం కూడా ప్రమాదమేనట. సబ్బులతో స్నానం చేయించడం వల్ల పిల్లలు చర్మం పొడి బారుతుందని, అందుకే రెండు, మూడు రోజులకు ఒకసారి స్నానం చేయించాలని వారు సూచిస్తున్నారు. పిల్లలను స్నానం చేయించేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు పాటిస్తుండాలని నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: