బుడుగు: పిల్లలు పుట్టిన వెంటనే ఏడిస్తే మంచిదా.. కాదా..??

N.ANJI
సాధారణంగా మహిళలు గర్భం దాల్చిన దగ్గరి నుండి బిడ్డకు జన్మనిచ్చేవరకు చాలా జాగ్రత్తగా ఉంటారు. అంతేకాదు.. పుట్టిన బిడ్డ విషయంలో డాక్టర్లు, నర్సులు ఎంత శ్రధ్ధ వహించినప్పటికీ తల్లిదండ్రులు అధికంగా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే బిడ్డ పుట్టిన వెంటనే హాస్పిటల్ సిబ్బంది బిడ్డను బాగా కడిగి వెంటనే తల్లికి అప్పగించాలని అంటున్నారు. అంతేకాక.. బిడ్డ పుట్టిన వెంటనే గంటలోపు వ్యవధిలోనే తల్లి బిడ్డకు ముర్రుపాలు తాగించాలని చెబుతుంటారు.
అయితే బిడ్డను వెచ్చటి శుభ్రమైన దుస్తులలో ఉంచి తల్లి శరీరం తగిలేలా వెచ్చగా ఉంచాలని చెబుతుంటారు. అంతేకాక.. బిడ్డ కనుక నెలలు నిండకుండా పుట్టి వుంటే, హాస్పిటల్ సిబ్బంది బిడ్డను వేరుగా ఇన్ క్యుబరేటర్ వంటి సాధనాలలో ఉంచి ఆరోగ్యాన్ని శ్రద్ధగా గమనిస్తూ ఉంటారని అన్నారు. ఇక అవసరమైన మందులు వాడాలని సూచిస్తున్నారు. ఇక బిడ్డ శ్వాసక్రియ సరిగా ఉందా లేదా అనేది ఎప్పటికపుడు గమనిస్తూ ఉండాలని అన్నారు. పుట్టిన పిల్లల సరైన బరువుతో పుట్టిందా? లేదా అనేది చెక్ చేసి అవసరమనుకుంటే వైద్యుల సలహాలు పొందాలని సూచించారు.
ఇక పిల్లలకు పుట్టిన వెంటనే వేయాల్సిన పోలియో చుక్కలు, సూదిమందులను వేయమని డాక్టర్‌ను కోరాలని చెబుతున్నారు. పిల్లలకు చేయించే ఇంజెక్షన్లు, ఇతర పోలియో చుక్కలు, వ్యాక్సిన్లు లేదా ఇతర పరీక్షలన్నింటికి తగిన రికార్డు నోటు చేసుకుంటూ ఉండాలి. అంతేకాక.. అపుడే పుట్టిన పిల్లలకు గాను ఆస్పత్రులలో కార్డులు అందజేస్తుంటారు. అయితే తల్లితండ్రులు తమ బిడ్డకు ఏ సమయంలో ఏ రకమైన వ్యాక్సిన్లు ఇప్పించాలనేది ఆ కార్డులో తెలియజేస్తుంది. అంతేకాదు.. ఈ రకమైన చికిత్సలు బిడ్డలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే ఏ రకమైన అనారోగ్య సమస్యలు వచ్చినట్లు గుర్తించినా, వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రం లేదా పిల్లల వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు. ఇక ఏరకమైన సమస్య వచ్చినా ఆలస్యం చేయక తక్షణ వైద్య సదుపాయం ఇప్పించటం అత్యంత అవసరంగా గుర్తించాలని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: