బుడుగు: పిల్లల్లో పెరుగుతున్న మియోపియా సమస్య.. కారణాలివే..??

N.ANJI
కరోనా మహమ్మారి పిల్లలపై చాలా విధాలుగా ప్రభావం చూపిస్తుంది. కరోనా కారణంగా విద్యా సంస్థలు మూతపడడంతో మొత్తం విద్య ఆన్లైన్ క్లాసులకు పరిమితమైంది. దాంతో పిల్లలు మొబైళ్లు, ట్యాబ్లు, కంప్యూటర్ల ముందు గంటల పాటు గడుపుతున్నారు. ఇక వారు స్క్రీన్ సమయం చాలా పెరిగిపోతుంది. అయితే ఈ కారణంగా పిల్లల్లో కంటి సమస్యలు అధికం అవుతున్నాయి. ఇక ఇలాంటి తరుణంలో పిల్లల్లో మియోపియా సమస్య ఎక్కువవుతోందని కంటి వైద్య నిపుణులు వెల్లడించారు. అంతేకాదు.. దగ్గరగా ఉన్న వస్తువులు స్పష్టంగా కనిపించినా.. దూరంగా ఉన్నవి బ్లర్ కనిపంచడాన్నే మియోపియా అంటుంటారు. ఇక పిల్లల్లో స్కింట్ ఐ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయని తెలియజేశారు
అయితే 8-16 సంవత్సరాల మధ్య పిల్లల్లో మియోపియా సమస్య రెట్టింపు అయిందని డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ నిర్వహించిన మీడియా సమావేశంలో కంటి వైద్యులు తెలిపారు. ఇక గతంతో పోలిస్తే మహమ్మారి కాలంలో స్కూల్ పిల్లల్లో మియోపియా కేసులు రెండు రెట్లు పెరిగాయని తెలియజేశారు. అంతేకాక.. మిగిలిన కంటి సమస్యలు కూడా అధికమయ్యాయని అన్నారు. అయితే కరోనా ప్రభాకం కంటే ముందు 10 నుంచి 15 శాతం మంది పిల్లలు వివిధ కంటి సమస్యలతో వైద్యుల వద్దకు వస్తుంటే.. ప్రస్తుతం ఆ సంఖ్య 30 నుంచి 40 శాతానికి పెరిగిందని వైద్యులు తెలిపారు.
ఇక ముఖ్యంగా కళ్లు పొడిబారడం, స్కింట్ ఐ, పొడి కళ్లు, మియోపియా, కండ్ల కలక తదితర సమస్యలు పిల్లల్లో ఎక్కువగా వస్తున్నాయని తెలిపారు. అయితే ఎక్కువ సేపు డిజిటల్ స్క్రీన్లను చూస్తూ ఉండడం వల్ల కళ్లు పొడిగా మారతాయని తెలియజేశారు. అంతేకాదు.. దూరంగా ఉన్నవస్తువులను స్పష్టంగా చూడలేకపోవడం, మెల్లకళ్లు, అలర్జీలు వచ్చే రిస్క్ ఉంటుందని అన్నారు. ఇక త్వరగా కళ్లలో నుంచి నీళ్లు రావడం వల్ల కూడా సమస్యలు వస్తాయని తెలిపారు. కాగా.. కళ్లు పొడిగా మారవడం వల్ల అలర్జీలు వంటి సమస్యలు తలెత్తుంటాయి. దాంతో చిన్నవయసులోనే మియోపియా అధికమయ్యే ప్రమాదం ఉంటుంది” అని వైద్యులు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: