బుడుగు: పిల్లలు మందులు వేసుకోవడానికి మారాం చేస్తున్నారా.. ?
ఇక రోజు రోజుకు కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, న్యూ స్ట్రెయిన్ ఇలా కరోనా ఏదో ఒక రూపంలో మనుగడ సాగించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మనకి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ మనం కరోనాతో కలిసి బ్రతక వలిసిన రోజులు ఇవి. కోవిడ్ 19 రోగులకు అందించే మందులలో విటమిన్ టాబ్లెట్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.
ఇక విటమిన్ సీ, విటమిన్ డీని కరోనా రోగులు తప్పనిసరిగా వాడవలసి ఉంది . కరోనా వచ్చిన తర్వాత ఈ రెండు విటమిన్ టాబ్లెట్లు కు మంచి డిమాండ్ పెరిగింది. అయితే త్వరలోనే మాములు ట్యాబ్లెట్లకు బదులు గమ్మీ విటమిన్ ట్యాబ్లెట్లే మార్కెట్‌ను ఏలబోతున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. సాఫ్ట్‌వేర్ ఎంప్లాయిస్ సైతం గమ్మీల ఫ్రెండ్స్ అయిపోతున్నారు.
అయితే మొదటసారి లాక్‌డౌన్ సమయంలో ఈ గమ్మీ ట్యాబ్లెట్లు మన దేశంలో మార్కెట్లోకి వచ్చాయి. ఆన్‌లైన్,మరియు ఆఫ్‌లైన్‌లో కూడా ఇవి లభిస్తున్నాయి. మెట్రో నగరాల్లో మంచి మార్కెట్ సొంతం చేసుకున్న గమ్మీలు ఇప్పుడు టైర్ టూ సిటీల్లో కూడా వచ్చేసాయి. ముఖ్యంగా స్త్రీలు , పిల్లలు ఈ గమ్మీలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు అని డాక్టర్లు అంటున్నారు. పాశ్చాత్య దేశాల్లో అయితే ఇప్పుడంతా ఈ గుమ్మిలదే మొదటి స్థానం. ఇక 2028 నాటికి అయితే విటిమిన్ సప్లిమెంట్స్‌లో గమ్మీలదే మొదటి స్థానంగా ఉంటాయట.