బుడుగు: పిల్లలలో భయాన్ని ఇలా పోగొట్టండి..!

N.ANJI
సాధారణంగా చాలా మంది పిల్లలు చిన్నచిన్న వాటికే భయపడుతూ ఉంటారు. అయితే పిల్లలో ఉన్న భయాన్ని పోగొట్టడానికి ఇలా ట్రై చేయండి. పిల్లలను దగ్గరకు తీసుకుని నీకు ఏదైనా భయం ఉంటే నేను ఆ భయం పోగెట్టేస్తాను అంటూ ధైర్యం చెప్పాలి. వాళ్ళు చెప్పే విషయాలు సిల్లీగా ఉన్నాయని నవ్వడం చేయకూడదు, సరే అని ఆ భయాన్ని పోగెట్టే మార్గం ఆలోచించాలి. ఇలా చేసినట్లయితే పిల్లలు హ్యాపీగా ఉంటారు.
ఇక హారర్ సినిమాలు, ఫ్రాంక్ వీడియోస్, దెయ్యం సినిమాలు మీతో పాటు చిన్నపిల్లలు చూస్తున్నప్పుడు నిజంగా చీకట్లో మన గదిలోకి వస్తాయేమో అని పిల్లలు భయపడుతూ ఉంటారు ఎక్కువగా. అవి అసలు నిజం కాదని పిల్లలకు అర్థం అయ్యేలా చెప్పాలి. చిన్న పిల్లలకు ఈ విషయాలు అర్థం కాకపోవచ్చు గానీ ఎదుగుతున్న పిల్లలకు నిజ జీవితానికి, సినిమాలలో చూపిస్తున్న దానికి మధ్య ఉన్న తేడాను అర్థం అయ్యేలా చెప్పాలి.
అయితే భయపడే విషయాలను పిల్లలు ఎక్కువగా గుర్తు చేసుకోవడం వలన, వారు విన్న కథలు లేదా చూసిన వీడియోలు తమ కళ్ళ ముందు కనిపిస్తున్నట్లుగా ఉండటం వలన భయంతో వణికిపోతూ ఉంటారు. అలాంటప్పుడు పిల్లలను ఒంటరిగా వదిలిపెట్టకూడదు. కూల్ గా ఉండమని కూర్చోబెట్టి రిలాక్స్ అవ్వమని చెప్పాలి. ఇలా టెన్షన్ పడటం వలన వారి ఆరోగ్యానికి ప్రమాదం. వెంటనే వారికి నచ్చిన విషయాలు చెప్పడం, ఫన్నీగా ఉండే విషయాలు గుర్తుచేయడం చేయాలి. అక్కడ ఏమీ లేదు అంటూ ధైర్యాన్ని ఇవ్వాలి.
కాగా.. చాలామంది పిల్లలు టీవీలలో వచ్చే కార్టూన్స్ చూసి భయపడుతూ ఉంటారు. రాత్రి పడుకున్నప్పుడు లేదా గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు కార్టూన్స్ లో ఉండే విలన్ లేదా రాక్షసుడు తమ దగ్గరకు వస్తున్నాడనే భయం ఎక్కువగా ఉంటుంది. ఆ క్షణం వరకు భయపడినా కూడా, మళ్ళీ నెక్స్ట్ రోజు కార్టూన్స్ చూడటం మాత్రం వదిలిపెట్టరు. అమ్మను అడిగిమరీ ఆ కార్టూన్స్ పెట్టించుకుంటారు. ఇలా భయపడుతున్నప్పుడు అందులో హీరో ఏం చేస్తాడో, వాటితో ఎలా ఫైట్చేస్తాడో నువ్వు కూడా అలా చేయాలి, ఇలా భయపడకూడదు అంటూ సున్నితంగా అర్థం అయ్యేలా చెప్పాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: