బుడుగు: మీ పిల్లలు అడగకూడని డౌట్స్ అడుగుతున్నారా.. అయితే ఇలా చేయండి..!?

N.ANJI
నేటి సమాజంలో చాల మంది పిల్లలు టీవీ, సెల్ ఫోన్ కి బాగా అలవాటు పడిపోతున్నారు. అయితే పిల్లలు ఇక టీవీలో వచ్చే యాడ్స్ గురించి ఏమైనా అడుగుతున్నారా. అంటే.. పిల్లలు టీవీల్లో, పేపర్లలో వచ్చిన ప్రకటనలు చూసి ప్రెగ్నెన్సీ కిట్, ప్రెగ్నెన్సీ టెస్ట్ గురించి మిమ్మల్ని అడిగితే, కంగారు పడుతుంటారు. అయితే మీరు పిల్లలు అడిగిన ప్రశ్నలకు ప్రశాంతంగా మీరే చొరవ తీసుకొని వివరించాలని నిపుణులు చెబుతున్నారు.

ఇక మీ పిల్లలకి దీని గురించి మరింత లోతుగా వివరించడానికి, వారి అకడమిక్ ఎగ్జామ్స్ ను ఉదాహరణగా తీసుకోండి. పై తరగతికి వెళ్ళడానికి స్కూలు ఎలాగైతే ఎగ్జామ్ నిర్వహించి పిల్లల జ్ఞానాన్ని పరీక్షిస్తుందో.. అలాగే ప్రెగ్నెన్సీ టెస్ట్ ద్వారా ఒక స్త్రీ శరీరం అమ్మ అవడానికి అనుకూంలంగా ఉందో లేదో  అనే విషయాన్ని తెలుసుకోవచ్చని చెప్పండి. అయితే, మీ పిల్లలకు ఇటువంటి నిషిద్ధ విషయాలు చెప్పడానికి మీరు కొంత భయపడడంలో అర్ధం ఉంది .

అయితే వారిలో సందేహాలు వచ్చినప్పుడు వాటిని  మీరు తీర్చక పోతే ఎలాగైనా తెలుసుకోవాలనే కుతూహలంతో ఆన్‌లైన్‌ లో సెర్చ్ చేస్తూ ఉంటారు. దీని వలన  తప్పుడు సమాచారం వారి మెదళ్ల లోకి వెళ్లే ప్రమాదం ఉంది. అందువల్ల, ఇటువంటి సందేహాలను మీరేతీర్చడం  మంచిదని గుర్తుంచుకోండి . ఒకవేళ ఇటువంటి ప్రశ్నకు ఎలా సమాధానం చెప్పాలో మీకు ఖచ్చితంగా తెలియకపోతే.. వారి నుండే సమాధానాన్ని రాబట్టేలా ప్రశ్నలు వేయండి.

అంతేకాక దీని గురించి నీకు ఏమి తెలుసు? ఇది ఎలా జరుగుతుందని అనుకుంటున్నావు? అని ప్రశ్నిస్తూ  మీరు వారు ఏమనుకుంటున్నారో తెలుసుకోవచ్చు. ఎందుకంటే వారి ఆలోచనలను మీతో పంచుకోవడానికి, మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ పెరగడానికి ప్రశ్నలువేయడం అనేది గొప్ప మార్గం అనే చెప్పాలి. కాబట్టి ఈ సారి ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు తడుముకోకుండా వారి సందేహాలను తీర్చండి అని నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: