బుడుగు: పిల్లల ఎదుగుదలకు కావలసిన పోషకాలను ఇలా అందించండి..!?
అయితే చాల మంది తల్లిదండ్రులు పనుల హడావుడి ఉంటారు. ఇక ప్రతిరోజూ ఇవన్నీ క్రమం తప్పకుండా ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. అందులోనూ మీ పిల్లలు ఒక దగ్గర కూర్చోకుండా, సరైన ఆహారాన్ని తినడానికి ఇష్టపడకపోతే ఆ భాద ఇంకా వర్ణణాతీతం. పిల్లలు తగినంత పోషకాలు ఉన్న ఆహారాన్ని తినడానికి నిరాకరించినప్పటికీ, వారికి సరైన పోషకాలను ప్రతిరోజు ఖచ్చితంగా అందించడం చాలా అవసరం.
అయితే పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారాపు పదార్థాలు అందించండి. అందులోనుండి వారు ఏది ఎంచుకున్నా కూడా వారికి ఆరోగ్యకరమే. ఇక మీరు మంచి ఆరోగ్యకరమైన ఆహారం తినడం వలన పిల్లలు కూడా మిమ్మల్ని అనుసరిస్తారు. ఎందుకంటే తల్లిదండ్రుకన్నా మంచి మార్గదర్శకులు మరొకరు ఉండరు. పిల్లలు తినే ఆరోగ్యకరమైన ఆహారాన్ని సరదాగా ఫన్నీ పేర్లతో పిలుస్తూ వాటి గురించి వినోధభరితమైన కథలను చెప్పండి, ఉదాహరణకు మ్యాజికల్ ఫవర్ పీ సూప్,మూషీ స్మూషి ఆలూ లేదా టిక్కీ ఫ్రూటీ మిల్క్‌షేక్ వంటివి.
ఇక కొన్ని సులభమైన, ఆరోగ్యకరమైన వంటలను తయారుచేయడం నేర్పించండి. పిల్లలు చెఫ్ ఆడటం ఇష్టపడతారు. జంక్ ఫుడ్‌కు బదులుగా, ఆరోగ్యకరమైన స్నాక్స్ నిల్వ ఉంచండి, తద్వారా పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారాపు పదార్థాలు అందుబాటులో ఉంటాయి. రోజులోని అతి ముఖ్యమైన భోజనం అల్పాహారంలో తగినన్ని పోషకాలను చేర్చండం మర్చిపోకండి, ఇది చిన్నపిల్లలలో పోషక పదార్ధాలను గణనీయంగా మెరుగుపరుస్తుంది, అంతేకాకుండా ఏదైనా సూక్ష్మపోషకాల లోపం ఉన్నప్పటికీ దానిని మెరుగుపరుస్తుంది.