చలికాలంలో ఖర్జూరం ఎందుకు తినాలి.. లాభాలెంటో తెలుసా?

praveen
ఖర్జూరం గురించి జనాలకు పరిచయం చేయాల్సిన పనిలేదు. ఆంధ్రులు ఎక్కువగా ఇష్టపడే ఫాలలో ఖర్జూరం ఒకటి. పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు... కాలాలను బట్టి ఫలాలని తీసుకోవాలని. ఈ చలికాలంలో ఒంట్లో శక్తి పెరగటానికి, జబ్బుల బారినపడకుండా ఉండటానికిది ఖర్జూర ఫలం అనేది చాలా అవసరం. ఇది శరీరానికి అత్యవసరమైన ఖనిజాలు, క్యాల్షియం, విటమిన్లు, పొటాషియం, ఫాస్ఫరస్‌, రాగి, మెగ్నీషియం వంటి పోషకాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ తక్షణ శక్తిని మానవ శరీరానికి ప్రసాదిస్తూనే ఆరోగ్యానికి మేలు కూడా చేస్తాయి. ఎముక ఆరోగ్యానికి విటమిన్‌ డి అనేది చాలా కీలకం. క్యాల్షియంతో నిండిన ఖర్జూరం తినడం వలన దీన్ని నివారించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
అంతేకాకుండా... ఎముకలు, దంతాలు బలపడడానికి ఈ ఖర్జూరం అనేది చాలా అవసరం. ఈ ఫలాలలో ఫాస్ఫరస్‌, పొటాషియం, రాగి, మెగ్నీషియం వంటి కారకాలు ఉండడం వలన ఎముకలు గుల్లబారటం, కీళ్లు అరగటం వంటి ఎముక సమస్యలు నివారణ కాగలవు. ఇంకా ముఖ్యంగా చలికాలంలో అయితే కీళ్ల నొప్పులు, బాధలు ఎక్కువవుతుంటాయి. కీళ్లనొప్పులతో బాధపడేవారి గురించి అందరికీ తెలిసిందే. వారి బాధ వర్ణించడానికి వీలు కాదు. ఖర్జూరంలోని నొప్పి నివారణ గుణాలు వీటిని కొంతవరకు తగ్గిస్తాయి. మెగ్నీషియం సైతం నొప్పులు, బాధలు తగ్గటానికి తోడ్పడుతుంది.
ఇంకా చలికాలంలో శరీర ఉష్ణోగ్రతలు అనేవి తగ్గుతుంటాయి. దీంతో పెద్దవారిలో గుండెపోటు వంటి ముప్పు పెరుగుతుంది. ఖర్జూరం తినటం వల్ల చెడ్డ కొలెస్ట్రాల్‌ తగ్గడం వలన గుండెపోటు, అధిక రక్తపోటు ముప్పులూ తగ్గుముఖం పడతాయి. ఖర్జూరం చలికాలంలో శరీరం వెచ్చగా ఉండటానికి అవసరమైన వేడిని సమకూరుస్తుంది. ఇంకా ఇందులో ఉన్న సహజ చక్కెర కారణంగా దీనిని చాలా పదార్థాలు, పానీయాల్లో ఉపయోగించుకోవచ్చు. ఖర్జూరంలో ఐరన్‌ దండిగా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలలో హిమోగ్లోబిన్‌ స్థాయులు మెరుగవుతాయి. అందుకే గర్భిణుల్లో ఐరన్‌ లోపం తలెత్తకుండా ఖర్జూరం తినాలని సూచిస్తుంటారు నిపుణులు. ఖర్జూరంలో నీటిలో కరిగే, కరగని.. రెండు రకాల పీచూ ఉంటుంది. చలికాలంలో జీవక్రియలు మందగించే తరుణంలో ఇదెంతో మేలు చేస్తుంది. జీర్ణకోశ వ్యవస్థ సక్రమంగా పనిచేయటానికి, మలబద్ధకం దరిజేరకుండా ఉండటానికి తోడ్పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: