బుడుగు: చంటి పిల్ల‌ల‌కు నిద్ర బాగా కావాల్సిందే.. ఎందుకో తెలుసా..?

N.ANJI
ఏ మనిషి అయినా రోజుకు 6 నుండి 7 గంటల వరకు నిద్ర పోవడం మంచిదన్న అందరికి తెలిసిందే. అయితే చంటి పిల్ల‌ల‌కు నిత్యం 17 గంట‌ల నిద్ర అవ‌స‌రం. ఆ  రేంజ్‌లో నిద్ర పోతేనే వారి శ‌రీరం ఎదుగుద‌ల స‌రిగ్గా ఉంటుంది. 0 నుంచి 3 నెల‌ల వ‌య‌స్సు ఉన్న పిల్ల‌లు నిత్యం 14 నుంచి 17 గంట‌ల వ‌ర‌కు నిద్ర‌పోవాలి. అదే 4 నుంచి 11 నెల‌ల వ‌య‌స్సు ఉన్న పిల్ల‌లైతే 12 నుంచి 16 గంట‌ల వ‌ర‌కు నిద్ర‌పోవాలి. అలాగే 12 నుంచి 35 నెల‌ల వ‌య‌స్సు ఉన్న చిన్నారులు నిత్యం 11 నుంచి 14 గంట‌ల వ‌ర‌కు నిద్ర‌పోవాలి. ఈ క్ర‌మంలోనే చంటి పిల్ల‌లు ఎక్కువ‌గా నిద్రిస్తే.. వారికి ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇక నిద్ర ఎక్కువ‌గా పోయే చంటి పిల్ల‌లే త్వ‌ర‌గా ఎదుగుతార‌ని సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌య‌నాలు వెల్ల‌డిస్తున్నాయి. నిద్ర‌లో శ‌రీరం అనేక జీవ‌క్రియ‌ల‌ను నిర్వ‌ర్తిస్తుంటుంది. ఆ స‌మ‌యంలో పిల్ల‌ల్లో ఎదుగుద‌ల హార్మోన్లు విడుద‌ల‌వుతాయి. అదే నిద్ర స‌రిగ్గా లేక‌పోతే ఆ హార్మోన్లు విడుద‌ల కాక ఎదుగుద‌ల స‌రిగ్గా ఉండ‌దు. శ‌రీర నిర్మాణం కూడా స‌రిగ్గా జ‌ర‌గ‌దు. క‌నుక నిత్యం చంటి పిల్ల‌ల‌ను బాగా నిద్ర‌పోయేలా చేయాలి.
పిల్ల‌ల‌కు భ‌విష్య‌త్తులో నాడీ సంబంధ స‌మ‌స్య‌లు రాకుండా ఉండాలంటే వారిని చిన్న వ‌య‌స్సులో బాగా నిద్ర‌పోయేలా చేయాలి. దీంతో వారు ఎదుగుతున్న కొద్దీ మెద‌డు ప‌రంగా స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. చిన్న‌త‌నంలో బాగా నిద్రించే వారి మెద‌డు ఎదుగుద‌ల స‌రిగ్గా ఉంటుంది. వారు అమోఘ‌మైన తెలివితేట‌లు క‌ల‌వారిగా మారుతారు. చ‌దువుల్లో బాగా రాణిస్తారు.
ఇక చిన్నారులు నిద్ర‌బాగా పోతే వారి మెద‌డులో జ‌రిగే క్రియ‌ల వ‌ల్ల వారు ఏ విష‌యాన్నైనా చాలా త్వ‌ర‌గా నేర్చుకుంటార‌ట. చంటి పిల్ల‌లు బాగా నిద్రించ‌డం వల్ల వారికి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని సైంటిస్టులు చెబుతున్నారు. ఒక వేళ ఏదైనా అనారోగ్య స‌మ‌స్య బారిన ప‌డినా త్వ‌ర‌గా కోలుకుంటార‌ని వైద్యులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: