బుడుగు : చిన్నపిల్లలకు ఏలాంటి ఆహారం పెడితే మంచిదో తెలుసుకోండి.. !!
పిల్లలకు ఆహారంలో పెట్టవలిసిన వాటిలో బీన్స్ ఒకటి. బీన్స్ లో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి, ఇవి పచ్చని ఆకుకూరలు, వెజిటేబుల్స్ కన్నా ఎక్కువ పోషకాలను కలిగి ఉంటాయి.చిన్నపిల్లలకు రోగ నిరోధక శక్తి పెరగటానికి కావలసిన ఫాటీ ఆసిడ్’లను నాటబడిన చెట్ల నుండి వచ్చిన విత్తనాలలో కలిగి ఉంటాయి అంతేకాకుండా జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచే ఫైబర్స్’ని కలిగి ఉంటాయి. అలాగే పిల్లలకు యోగార్ట్ తినటం వలన ఆరోగ్యానికి చాలా రకాలైన ఉపయోగాలు ఉన్నాయి, పాలు, పాల ఉత్పత్తుల వలే కాకుండా త్వరగా జీర్ణమవుతుంది. ఇవి ఒక సహజసిద్దమైన ‘ప్రోబయాటిక్’ఇవి జీర్ణక్రియని పెంచే, ‘బోవేల్ సిండ్రోం’ (పేగు కదలికలు) చికాకులు, జీర్ణాశయ గొట్టంలో ఇన్-ఫెక్షన్స్ (అంటూ వ్యాదులు) రాకుండా చేస్తాయి. అలాగే పిల్లలకు శక్తిని ఇచ్చే ప్రోటీన్స్ ను కలిగి ఉన్నాయి. ఎముకలకి బలాన్ని ఇచ్చే కాల్షియంని కుడా కలిగి ఉంటాయి. పిల్లలు తినే ఆహారంలో సోయాని తినటం లేదా! అయితే తప్పకుండా మీ ఆహారంలో కలుపుకోండి.
సోయా ‘లేగ్యుం కుటుంబానికి చెందిన చెప్పుకోదగిన ఆహార పదార్థం. ఇందులో బీన్స్, డ్రైడ్ పీస్ కూడా ఇందులో చేర్చారు. సోయా కుడా మినరల్స్, కాల్షియం, ఐరన్, జింక్’లను పుష్కలంగా కలిగి ఉంటుంది. ఎముకల ద్రుడత్వానికి కాల్షియం, కణాల మరమ్మత్తుకు ఐరన్, పెరుగుదలకు, అలాగే రోగనిరోధక శక్తికి జింక్ అవసరం. ఈ రోజుల్లో నట్స్’ని సలాడ్స్, రెసిపిలలో స్నాక్స్’గా వాడుతున్నారు. ఇవి శరీరంలోని మంచి లేదా HDL కొలెస్ట్రాల్’ని ప్రభావితం చేయకుండా, చెడు లేదా LDL కొలెస్ట్రాల్ సాంద్రతని తగ్గించే శక్తిని కలిగి ఉన్నాయి. నట్స్’లో బాదం, వేరుశనగలు, హజేల్ వంటి నట్స్’లలో ఎక్కువగా యాంటీ-ఆక్సిడెంట్స్, విటమిన్ ‘E’లని, ఎక్కువ క్యాలోరీలని కలిగి ఉంటాయి. పిల్లల శరీరానికి కావలసిన అన్ని రకాల విటమిన్’లని ఇవి అందిస్తాయి.