బుడుగు : వర్షాకాలంలో మీ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలానో తెలుసుకోండి.. !!

Suma Kallamadi
ఒకపక్క కరోనా వైరస్ తో దేశం మొత్తం అతలాకుతలం అయింది. మరో పక్క వర్షాలు భారీగా  కురుస్తున్నాయి. కరోనా వైరస్ నుండి పిల్లల్ని ఎలా కాపాడుకోవాలో అర్ధం కాకుండా తికమక పడుతుంటే, ఇప్పుడు మళ్ళీ ఈ వానలు కూడా ఎక్కువ అయ్యాయి. ఈ వర్షాకాలంలోనే ఎక్కువగా పిల్లలకు అంటు వ్యాధులు ప్రబలుతాయి. మరింత జాగ్రత్తగా ఉండే సమయం ఇది.. పెద్దవాళ్ళతో పోల్చుకుంటే పిల్లలలో వ్యాధి నిరోధక శక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందుకనే తొందరగా వ్యాధులకు గురి అవుతారు.ఈ  సమయంలో రోగ నిరోధక శక్తి అత్యంత ప్రధానమైన అంశం. అందుకే వారి ఆహారం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. వారి ఆహారంలో ఈ పదార్థాలు ఉండేలా చూసుకోండి.

పిల్లల పెరుదలకు, ఆరోగ్యానికి విటమిన్ ఎ, అలాగే జింక్ చాలా  ముఖ్యం. అందుకే వారి ఆహారంలో తరుచూ క్యారెట్లు, ఆకుకూరలు ఉండేలా చూసుకోండి. క్యారెట్‌తో  కంటిచూపు మెరుగు అవుతుంది. దాంతో వారి రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అలాగే పిల్లల శరీరంలో ఉండే బ్యాక్టీరియా నశించాలి అంటే వారికి పెరుగు ( Curd ) తప్పకుండా తినిపించాలి. పెరుగు తినడం వల్ల అందులో ఉండే కాల్షియం వల్ల ఎముకలు గట్టిగా మారుతాయి. దానితో పాటు వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అలాగే నారింజ, బత్తాయి వంటి నిమ్మ జాతి పండ్లు తినడం వల్ల పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో ఉండే విటమిన్ సీ ( vitamin c ) వల్ల ఫ్లూ, జలుబు, ఫీవర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.


అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా పిల్లల ఆహారంలో భాగం చేయాలి. బాదం ( Badam ) , పిస్తా, జీడిపప్పు (Cashew ) తినడం వల్ల అందులో ఉండే పోషకాల వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. పిల్లలు బలంగా మారతారు. తొందరగా అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉండదు. అలాగే పాలు, పాల పదార్ధాలు పిల్లలకు ఇవ్వడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. పాలల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది పిల్లల పెరుగుదలకు ఎంతగానో సహాయపడుతుంది. అలాగే పిల్లలకు ఈ కాలంలో అసలు కూలింగ్ వాటర్ తాగించకూడదు.. వీలయితే కాచి చల్లార్చిన నీళ్లు తాగించడం చాలా మంచిది.. !!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: