బుడుగు : చిన్నపిల్లల్లో వచ్చే దగ్గును తేలికగా తీసుకోకండి.. !!అది చాలా డేంజర్.. !!

Suma Kallamadi
చిన్నపిల్లల్లో ఎక్కువగా ఇబ్బంది పెట్టె సమస్యల్లో దగ్గు ఒకటి.దగ్గు వచ్చినప్పుడు మనం ఎన్ని మందులు వాడిన తొందరగా తగ్గదు.ఒక్కోసారి దగ్గడం వల్ల పిల్లలకు గొంతు నొప్పి కూడా వస్తూ ఉంటుంది. దానివల్ల దగ్గలేక ఏడుస్తూ ఉంటారు. అయితే చాలా మంది పిల్లలు సాధారణ జలుబు తరువాత 3 వారాలు లేదా అంతకంటే ఎక్కువ రోజులు దగ్గు వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. కొంతమంది పిల్లల్లో అయితే ఏవన్నా చల్లని పదార్ధాలు తిన్నాగాని దగ్గు వస్తూ ఉంటుంది. ముఖ్యంగా వారు ప్రీస్కూల్ వయస్సులో ఉన్నప్పుడు ఎక్కువగా వస్తుంది. దగ్గుకు కారణాలు జలుబు, ఉబ్బసం, ఛాతీ ఇన్ఫెక్షన్లు. అయితే ఒక్కోసారి సిగరెట్ పొగ వంటివి పిల్లలు మాములుగా ఉన్నప్పుడు కూడా దగ్గుకు కారణమవుతుంది.అయితే చిన్నపిల్లల్లో వచ్చే ఈ  దగ్గుని సాధారణం అని వదిలేయకండి. 4 వారాల కన్నా ఎక్కువ రోజులు దగ్గు కొనసాగడం సాధారణమైన విషయం కాదు. ఇది ఛాతీ వ్యాధికి సంకేతం కావచ్చు. అందుకే పిల్లల్ని వైద్యుడి దగ్గరకు తప్పకుండా తీసుకుని వెళ్ళాలి..!



అలాగే వారు శ్వాస తీసుకోవడం కష్టం అయినాగానీ, వేగంగా శ్వాస తీసుకుంటున్నాగాని, 38.5 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత కలిగి ఉండడం గాని, సాధారణంగా మాట్లాడ లేకపోవడం వంటి లక్షణాలు మీ పిల్లల్లో కనబడితే మాత్రం తప్పకుండా వైద్యుడు దగ్గరకు తీసుకుని వెళ్లడం మంచిది.అలాగే కొంతమంది పిల్లలకు సిగరెట్ పొగ పడదు.అలా సిగరెట్ పొగను పిల్లలు ఎక్కువగా పీల్చినప్పుడు అది దగ్గుకు కారణమవుతుంది.



అందుకని పిల్లలు ఉన్న ఇంట్లో సిగరెట్ కాల్చకూడదు. మీ పిల్లల్ని పొగ లేని వాతావరణంలో పెరిగేలా జాగ్రత్తలు వహించండి.పిల్లవాడికి దగ్గు బాగా వస్తుంటే తేనె వాడడం వల్ల దగ్గు నుండి ఉపశమనాన్ని పొందవచ్చు. వైరల్ ఇన్ఫెక్షన్, శ్వాసకోశ సంక్రమణ సంబంధిత దగ్గుకు తేనె మంచిగా సహాయపడుతుంది.అలాగే మీ పిల్లల గొంతులో లేదా ఛాతీలో బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉందని మీ వైద్యుడు కనుగొంటే వారు సూచించిన యాంటీబయాటిక్స్ తప్పకుండా వాడాలి.. !!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: