బుడుగు: పిల్లలు సరిగ్గా నిద్రపోకపోతే ఏమవుతుందో తెలుసా.. !!
ఈ కరోనా సమయంలో అందరం ఇంటిలోనే ఉండాలిసిన పరిస్థితి.పిలల్లకు ఒక పక్క స్కూల్స్ అన్ని మూతపడ్డాయి. ఇంకేముంది వాళ్ళ ఇష్టా రాజ్యం అయిపొయింది. ఇంట్లోనే ఉండడం చేత నిద్రకు సరైన ప్రాధాన్యత ఉండడం లేదు. ఈ సమస్య పిల్లలలో ఎక్కువగా ఉంది అని అంటున్నారు వైద్యులు. టీవీ,స్మార్ట్ ఫోన్ వచ్చినప్పటి నుంచి పిల్లలు టైంకు నిద్రపోవడం లేదని వారి వాదన.సెలవులు కావడంతో పిల్లలు రాత్రి 12గంటల వరకు టీవీ చూడటం, ఉదయం 11 గంటల వరకు నిద్రపోవడం చాలా మంది ఇళ్లల్లో జరుగుతుంది.
ముఖ్యంగా ఏడేళ్లలోపు పిల్లలకు నిద్రలేకపోతే పెద్దయ్యాక అనేక రుగ్మతలకు గురవుతారని అంటున్నారు. ఏకాగ్రత తగ్గడం,భావోద్వేగాలను అదుపు చేయలేకపోవడం ఒత్తిడికి లోనవడం వంటివి ప్రధాన సమస్యలు. ఇంట్లో ఉండి అస్తమానం టీవీ, ఫోన్ చూడడం వాళ్ళ కళ్ళు దెబ్బతినే ప్రమాదం ఉంది.అందుకనే పిల్లల ఎదుగుదలలో నిద్ర చాలా కీలకం. రోజుకు 6-10 గంటల నిద్ర అవసరమని.. 3-5 సంవత్సరాల పిల్లలు రోజుకు 11 గంటలు నిద్రపోవాలని చెబుతున్నారు. వయసుకు తగినంత నిద్ర లేకపోవడం వల్ల పరిసరాలు, అవసరాలకు తగ్గట్టు మెదడు స్పందించే సామర్థ్యం తగ్గుతూ వస్తుందని చిన్నపిల్లల మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు..
అలాగే పిల్లలకు సరైన నిద్ర అనేది లేకపోతే పసితనంలోనే చాలా ఆరోగ్య సమస్యలు తలెత్తుత్తాయి.. పిల్లలకు భవిష్యత్తులో నాడీ సంబంధ సమస్యలు రాకుండా ఉండాలంటే వారిని చిన్న వయస్సులో బాగా నిద్రపోయేలా చేయాలి. దీంతో వారు ఎదుగుతున్న కొద్దీ మెదడు పరంగా సమస్యలు రాకుండా ఉంటాయి.కంటి సమస్యలు, తలనోప్పి, మానసిక ఆందోళన, మెదడు పై ప్రభావము చూపడం వాళ్ళపిల్లలు సరిగా చదదవలేరు. అందుకని పిల్లల్ని ఎక్కువ సేపు టీవీ చుడనివ్వకండి.టీవీ చూసే అప్పుడు దూరంగా కూర్చీని చూడాలి. ఈ పసితనంలోనే కళ్ళపై ఎటువంటి ప్రభావం పడిన గాని కళ్ళజోడు తప్పనిసరి. అలాగే ఫోన్ వాడకం కూడా తగ్గించాలి. ఒక నిర్ణిత సమయానికి పిల్లలకు నిద్రపోవడం అలవాటు చేయాలి.రాత్రిళ్ళు తొందరగా అన్నం పెట్టి నిద్రముంచితే మరి మంచిది.