బుడుగు: అమ్మ నాన్నా చేతిలో ఫోన్ అయి పుడితే బాగుండు అనుకుంటున్నా పిల్లల మోనోవేదన.. !!
పిల్లల పెంపకం విషయంలో ప్రతి తల్లి తండ్రి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే పిల్లల పెంపకం విషయంలో ఎటువంటి లోపాలు ఉన్న పిల్లల భవిష్యత్తు మీద ప్రభావం పడుతుంది. పిల్లలు తల్లిదండ్రుల నుంచి ఆశించేది ఒక ప్రేమ అనురాగం ఆప్యాయత మాత్రమే. మేము పిల్లలం మీ ఇంటి ప్రమిదలం మేము.. తల్లిదండ్రులు ఎంత సంపాదించినా కానీ అది పిల్లల కోసమే అలా అని డబ్బు సంపాదనలో పడి పిల్లల యొక్క సంరక్షణ గురించి పట్టించుకోవడం మానేస్తున్నారు. ఈ మధ్య పిల్లలు యొక్క మొండితనానికి, లేత మనసులు భాధ పడడానికి తల్లిదండ్రుల ప్రవర్తన చాలా కారణం. పిల్లల్ని ఒక యంత్రంలా గానే చూస్తున్నారు తప్ప వాళ్ళకి ఒక మనసుంటుంది వాళ్ళకి ఒక ఆలోచన ఉంటుంది అన్న విషయాన్ని తల్లిదండ్రులు గ్రహించడం లేదు.
పొద్దున మమ్మల్ని (పిల్లలు) స్కూల్కు పంపి సాయంత్రం నాలుగింటికి స్కూల్ అయిపోయాక మళ్ళీ స్పెషల్ క్లాస్ అని, తర్వాత ట్యూషన్ అని చెప్పి స్కూల్ లోనే గడిపేయమంటున్నారు. ఇంటికి వచ్చాక కూడా ప్రేమగా మాట్లాడదామంటే లేదు. అమ్మ నాన్నలు ఎంత సేపు ఫోన్ పట్టుకుని ఆడుకోవడం కానీ లేదంటే టీవీ చూడటం లేదని ఆఫీస్ వర్క్ చేసుకోవడం గాను చేస్తున్నారే తప్ప బాబు ఏంటి స్కూల్లో ఈరోజు ఏం జరిగినది, ఏమి చెప్పారు,ఏమి నేర్చుకున్నావు అని అడగరు. ఏమి కొత్త కొత్త విషయాలు జరిగాయి. ఏంటి నీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు. నీకు ఏమంటే ఇష్టం చెప్పు,టిఫన్ ఏమి చేయను,కూర ఏమి వండను అని నా ఇష్టాలు అడగరు.ఈ కూర వండి పెట్టు అని అంటే ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చి తినేసి అంటున్నారు తప్ప పిల్లవాడి కోసం ఏ తల్లి నచ్చింది చేయటం లేదు ఈ రోజుల్లో.అమ్మ చేతి వంట మధురం.. అమ్మ పిల్లల కోసం కష్టపడి చేసే వంటలో అమ్మ ప్రేమ ఉంటుంది..
పిల్లలకు ఆ ప్రేమ కావాలి. సంపాదించే డబ్బు పిల్లల కోసం కరెక్టే కానీ ఆ డబ్బు సంపాదనలో పడి పిల్లల్ని మర్చిపోతున్నారు తల్లిదండ్రులు. పిల్లలకు తల్లిదండ్రుల నుంచి దూరం ఏర్పడుతుంది. ఉద్యోగరీత్యా అమ్మ బయటికి వెళ్తే ఇంట్లో ఆయ ని పెడుతున్నారు.. అమ్మ ప్రేమ మాకు ఎక్కడ దక్కుతుంది ఇంకా.." చందమామే రావే జాబిల్లి రావే.. కొండెక్కి రావే, బంతిపూలు తేవే మా అబ్బాయి నోట్లో పెట్టవే ""అని అమ్మ మా కోసం పాట పడి గోరుముద్దలు పెట్టె రోజు కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాము.. ఆఫీస్ నుంచి వచ్చిన నాన్న ఎంచక్కా మాతో ఆడి, మమ్మల్ని తన భుజాల మీద ఎత్తుకుని లోకం చూపిస్తుంటే అప్పుడు మా పిల్లలకు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు..
మాతో ఫొటోస్ దిగి వాట్స్ అప్ లో, ఫేస్ బుక్ లో పెట్టి ఎన్ని లైక్స్ వచ్చాయి అని చూసుకుంటున్నారే తప్ప మమల్ని, మా ఇష్టాల్ని అర్ధం చేసుకోవడం లేదు... ఎంతసేపు ఫోన్లో మాట్లాడం, ఆడడం.. ఫోన్ ప్రపంచం అయిపోయింది.. మాకు ఫోన్ ఇచ్చేసి మమ్మల్ని ఒక యంత్రాల లాగా మారుస్తున్నారు.. ఒక్కోసారి మీ చేతిలో ఫోన్ నేనయితే బాగుండు అని అనిపిస్తుంది.. ఎల్లపుడు మీతోనే ఉంటాను అని అనిపిస్తుంది..