బుడుగు: పిల్ల‌లు కాయిన్స్ మింగితే ఎలా తీయాలంటే?

Arshu
పిల్లలు పుట్టినప్పటి నుంచి కూడా చాలా జాగ్ర‌త్త‌గా చూసుకుంటూ ఉండాలి. ఎప్ప‌టిక‌ప్పుడు గ‌మ‌నించుకుంటూ ఉండాలి.  పెరిగి పెద్దయ్యేంతవరకు తల్లిదండ్రులకు పరీక్షే..ముఖ్యంగా ఐదు ఆరు నెలల వయసు నుండి ఐదేండ్ల వరకూ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి.ఎందుకంటే పాకడం,వస్తువులను చేతితో పట్టుకోవడం నేర్చుకుంటున్న క్రమంలో ఆ వస్తువులను నోటిలో పెట్టుకుంటుంటారు..అందుకని చిన్నపిల్లలు ఉన్న ఇళ్లల్లో చిన్నచిన్న వస్తువులను వారికి అందుబాటులో ఉంచకుండా జాగ్రత్త పడాలి..ఒకవేళ పిల్లలు కాయిన్స్ లాంటివి మింగినట్టైతే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరి..

 పిల్లలు ఏదైనా వస్తువు నోట్లో పెట్టుకున్నప్పుడు లేదా వారి గొంతులో ఏదైనా ఉన్నట్లయితే నోటి నుండి లాలాజలం కారుతూనే ఉంటుంది.మరోవైపు గుక్కపెట్టి ఏడుస్తూ ఉంటారు.ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది. ఉన్నట్లుండి శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. మెడ, చెస్ట్ భాగాలలో నొప్పి ఎక్కువగా ఉంటుంది, స్పృహ కోల్పోవడం జరుగుతుంది, వాంతులు అవుతూ ఉంటాయి. ఈ లక్షణాలు ఉంటే మీ పిల్లల నోట్లో ఏదో ఉందని వెంటనే గుర్తించాలి.

పిల్లలు కాయిన్స్ మింగినప్పుడు అవి గొంతుకు అడ్డం పడుకండా కడుపులోకి వెళ్లిపోతే ఏ సమస్యా ఉండదు.అలా కాకుండా గొంతులోనే అడ్డంగా ఉండి ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా ఉంటే మాత్రం కష్టం..కాబట్టి పిల్లలు కాయిన్స్ మింగారని తెలియగానే ముందుగా వారి చేత వాటర్ కాని,ఏదన్నా డ్రింక్ కాని తాగించే ప్రయత్నం చేయాలి..దీని ఫలితంగా కాయిన్  గొంతులో నుండి కడుపులోకి వెళ్లే అవకాశం ఉంటుంది.గొంతులో ఇరుక్కుపోకుండా కడుపులోకి కాయిన్స్ వచ్చినట్లయితే చాలా వరకు ప్రమాదం తప్పినట్లేనని డాక్టర్స్ చెబుతున్నారు, కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు.పిల్లలకు ఎటువంటి నొప్పి లేకుండా, కాయిన్స్ గొంతులో లేవు అనిపిస్తే, పిల్లల  మలంలో కాయిన్స్ వచ్చాయేమో గమనించాలి. ఇలా రానట్లయితే అరటిపండు తినిపించాలి.పిల్లలకు నొప్పిగా ఉండి, ఒకరోజు లేదా రెండు రోజులైనా కాయిన్స్ బయటకు రాకపోతే వెంటనే హాస్పిటల్ కు వెళ్ళాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: