జగమంత జగన్‌: వాళ్లంతా కలసి.. వైసీపీని గెలిపించారుగా?

Chakravarthi Kalyan
ఏపీలో పోలింగ్ ముగిసి మూడు రోజులైంది. పోలింగ్ సరళిపై అన్ని పార్టీల నాయకులు ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు.  గతంతో పోలిస్తే ఈ సారి పోలింగ్ శాతం కాస్త పెరిగింది. మొత్తంగా అయితే సైలెంట్ ఓటింగ్ నమోదు అయింది. భారీగా పోలింగ్ నమోదైనా ఫలితాల విశ్లేషకులకు సైతం అంతు చిక్కడం లేదు. అధికార పార్టీ కి కానీ.. ప్రతిపక్ష పార్టీకి కానీ ఎడ్జ్ ఉందని ఎవరూ చెప్పలేకపోతున్నారు.

పెరిగిన పోలింగ్ ప్రభుత్వ సానుకూలతకు నిదర్శనం అని వైసీపీ.. కాదు కాదు ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమని కూటమి నేతలు ఎవరికీ వారు లెక్కలు వేసుకుంటున్నారు. గెలుపు తమదే అని ఇరు పార్టీల నాయకులు చెబుతున్నా..లోలోపల మాత్రం ఆందోళన కలిగిస్తోంది. ఈ సారి ఎన్నికల్లో ఓటేసేందుకు ఏపీకి వివిధ రాష్ట్రాల నుంచి, దేశ విదేశాల నుంచి భారీ ఎత్తున ఎన్నారైలు తరలి వచ్చారు. వీరంతా ఎటువైపు మొగ్గు చూపారు అనేది అంతు చిక్కడం లేదు.

ఇలా ఫలితాలపై సస్పెన్స్ కొనసాగుతుండగా.. కొన్ని మీడియా ఛానళ్లు వైసీపీని గెలిపించేశాయి. వాస్తవంగా జూన్ 4న ఫలితాలు వెలువడతాయి. కానీ అంతకుముందే ఓటింగ్ సరళి జరుగుతుండగానే వైసీపీ విజయం ఖాయమైందనే సంకేతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నాయి ఓ మీడియా వర్గం. అవే సాక్షి, ఎన్టీవీ, టీవీ 9లు. ఈ ఛానళ్లతో పాటు వైసీపీ సోషల్ మీడియా వారియర్స్, పార్టీ కార్యకర్తలు ఫేస్ బుక్ లలో వైసీపీ విజయం సాధించిందనే పోస్టులు పెట్టారు.

అయితే జూన్ 1 సాయంత్రం 5 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదల అవుతాయి. వీటి బట్టి ఒక అంచనాకు రావొచ్చు అని విశ్లేషకులు చెబుతున్నారు. ఇవి ఎగ్జాక్ట్ పోల్స్ కాకపోయినా దాదాపు ఓ నిర్ణయానికి రావడానికి అవకాశం ఉంటుంది. ప్రజల స్వింగ్ ఎలా ఉందనేది చెప్పొచ్చు. ఇదిలా ఉండగా వైసీపీని మాత్రం పైన పేర్కొన్న మీడియా ఛానళ్లు, కొందరు వ్యక్తులు ఆలరెడీ గెలిపించేశారు. మరి జూన్ 4న ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: