ఏపీలో ఎవరు ఎటువైపు:పక్కా సీఎం జగనే..ఎస్సీలంతా ఏకపక్షమేనా..?

Pandrala Sravanthi
-ఎస్సీల కోసం అత్యధిక నిధులు.!
- ఈ సామాజిక వర్గమే జగన్ ను సీఎం చేస్తుందా..?

 ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ ముగిసాయి. అసెంబ్లీ పార్లమెంట్ బరిలో నిలిచిన అభ్యర్థుల  భవితవ్యం మొత్తం బ్యాలెట్ బాక్స్ లో నిక్షిప్తమై ఉంది. ఇదే తరుణంలో రాష్ట్రంలో ఏ పార్టీ గెలుస్తుంది అనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఎన్నికల రిజల్ట్ ఇంకా 20 రోజులు ఉన్న తరుణంలో,   ప్రతి ఇంటిలో ఎవరు గెలుస్తారు అనే చర్చ జరుగుతోంది.  అంతేకాదు ఏ సామాజిక వర్గం ఓట్లు ఏ పక్కా పడ్డాయి అనేది చాలా కీలకంగా మారింది. ఈసారి విజయాన్ని ఖరారు చేసేది మాత్రం సామాజిక వర్గాల ఓట్లే అని తెలుస్తోంది. దీంతో రెండు పార్టీలు,  ఎవరు ఏ వైపు వేశారు అనే దానిపై దృష్టి పెట్టి సర్వే చేయించుకుంటున్నారట. ఇదే తరుణంలో  ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద సామాజిక వర్గమైనటువంటి ఎస్సీ సామాజిక వర్గం ఓట్లు ఈసారి చాలా  కీలకం అయ్యాయి. మరి ఎస్సీ వర్గ ఓట్లు ఏ పార్టీకి ఎక్కువ పడ్డాయి అనే వివరాలు చూద్దాం. ఏపీ రాష్ట్రంలో దాదాపు నాలుగు కోట్ల 13 లక్షల 33 వేల ఓటర్లు ఉండగా  అందులో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు అత్యధికంగా ఉన్నారు. మాదిగలు 15 లక్షల 85వేలు ఉండగా,  మాల సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు 35 లక్షల 46 వేల ఉన్నారు. ఈ విధంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక ఓటర్లు ఉన్నది ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారే అని చెప్పవచ్చు. ఈ వర్గానికి చెందిన ఓటర్లలో ఎక్కువగా ఓట్లు ఏ పార్టీకి పడ్డాయి అనే వివరాలు తెలుసుకుందాం.
 కీలకమైన ఎస్సీ ఓట్లు :
 రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో  రెండు పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రత్యేకమైన బృందాలను ఏర్పాటు చేసుకొని ఏ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఆ సామాజిక వర్గ  ఓటర్లను ప్రభావితం చేశారని చెప్పవచ్చు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎస్సీ. ఈ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా జగన్ వైపే మగ్గినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఎస్సీల కోసం జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలలో ఎన్నో సంక్షేమ ఫలాలు తీసుకువచ్చారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎంతో మంది లబ్ధి పొందారు. రాష్ట్రం మొత్తంలో ఎస్సీ రైతులకు సబ్సిడీ మీద వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు, ట్రాక్టర్లు, వరి కోత మిషన్లు  అందించారు. దాదాపుగా కోట్లాదిమంది ఎస్సీ, ఎస్టీ జనాభా  లబ్ధి పొందారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీల కోసం  కోట్లాది రూపాయల నిధులను ఖర్చు చేసిన జగన్ వైపే ఎస్సీలు ఉన్నట్టు తెలుస్తోంది.  ఇందులో ముఖ్యంగా మాల సామాజిక వర్గానికి చెందిన ఓట్లు వన్ సైడ్ గా  వైసీపీకే పడ్డట్టు తెలుస్తున్నది. మాదిగ సామాజిక వర్గం నుంచి 70%  వైసిపికి 30%  తెలుస్తుంది. ఈ విధంగా ఎస్సీ సామాజిక వర్గం ప్రజలు జగన్ ను మరోసారి ముఖ్యమంత్రి చేయబోతున్నారని  కొంతమంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: