బుడుగు: క‌్లాస్ రూమ్‌లో పిల్ల‌లు ఎలా ఉండాలంటే...?

Arshu
పిల్ల‌లు ప్ర‌వ‌ర్త‌న‌మంచిదైనా చెడుదైనా స‌రే అది మార్చ‌టానికి పాఠ‌శాల‌లే కీల‌క పాత్ర‌ని పోషిస్తాయి. ఎందువ‌ల్ల నంటే పిల్ల‌లు ఎక్కువ స‌మ‌యం ఇంట్లో త‌ల్లిదండ్రుల‌కంటే స్కూల్లోనే గ‌డుపుతారు కాబట్టి మంచైనా చెడైనా ఎక్కువ శాతం అక్క‌డే నేర్చుకుంటారు. అలాగే క్ర‌మ‌శిక్ష‌ణ పేరుతో స్కూల్లోగాని ఇంట్లోగాని పిల్ల‌ల‌ను ఎక్కువ‌గా దండించ‌కూడ‌దు. వాళ్ళ‌కు అర్ద‌మ‌య్యే భాష‌లో చ‌క్క‌గా చెప్పాలి. అంతేగాని వారికి స్కూల్లో సివియ‌ర్ ప‌నిష్‌మెంట్స్ లాంటివి ఇవ్వ‌కూడ‌దు. వాటి వ‌ల్ల పిల్ల‌లు అవ‌మానంగా ఫీల‌యి మాన‌సికంగా కృంగిపోతారు. 

చాలా మంది మ‌గ‌పిల్ల‌లు క్లాస్ రూంలలో అల్ల‌రి చిల్ల‌రిగా ఉంటారు. మిస్ బిహేవ్ (తప్పుగా ప్రవర్తించటం) చేస్తారు. అలాగే క్లాస్ రూంలలో చిరాకుపడటం, పద్ధతులకు భిన్నంగా మొండిగా నడుచుకోవటం, తోటి పిల్లలతో సరిగా ఉండకపోవటం.. లాంటివి చేసే పిల్లల ప్రవర్తనకు.. క్లాస్‌రూం డిసిప్లిన్ కూడా ఒక కారణమవుతోంది. ఎదైనా తెలియ‌క పోతే టీచ‌ర్లు అంద‌రి ముందు పిలిచి తిట్ట‌డం వంటి ప‌నులు చేయకూడ‌దు. అలాగే ఏదైనా తప్పు చేస్తే ద‌గ్గ‌ర‌కు పిలిచి చ‌క్క‌గా చెప్పాలి. దాంతో వారి ప్ర‌వ‌ర్త‌లో కొంతైనా మార్పు ఉంటుంది. 

  క్లాస్ రూం కల్చర్ వల్లనే కొంతమంది పిల్లలు మిస్ బిహేవ్‌ చేసే పరిస్థితికి దోహదమవుతోందని  అధ్యయనకర్తలు అంటున్నారు.దీంతో విపరీత ప్రవర్తనకు అలవాటుపడిన పిల్లలు పలు అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం కూడా ఉందని వారు హెచ్చరిస్తున్నారు. మాన‌సికంగా కృంగిపోవ‌డం వ‌ల్ల వాళ్ళ బిహేవియ‌ర్‌లో ర‌క‌ర‌కాల మార్పులు క‌నిపిస్తాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: