దుష్టులకు దూరంగా..... గొర్రెపిల్ల నక్క కథ

Durga
ఒకరోజు చిన్న గొర్రెపిల్ల ఒకటి దాహం తీర్చుకోవడానికి అడవిలో ఉన్న ఓ కాలువ దగ్గరకు వెళ్లింది. ఆ అడవిలోని క్రూర మృగాలు కూడా దాహం తీర్చుకోవడానికి ఆ కాలువ దగ్గరకే వస్తుంటాయి. గొర్రె పిల్ల భయపడుతూనే గబగబా నీళ్లు తాగడం మొదలు పెట్టింది. దాని కంటే ముందే అక్కడకు వచ్చిన ఓ నక్క గొర్రెపిల్లను చూడగానే నక్క గట్టిగా ‘ ఏయ్ ఆగు .. నేను తాగే నీళ్లన్నీ పాడవుతున్నాయి’’ అని అరిచింది. అయ్యో నక్క మామా ! నీళ్లు నీ వైపు నుంచె ఇటుపక్కకు పారుతున్నాయి. నువ్వు తాగే నీళ్లు నేనెలా పాడుచేస్తాను’’ అని అమాయకంగా అంది గొర్రెపిల్ల. ఆ మాటలు నిజమే.. కానీ అది ఒప్పుకోవడానికి నక్క సిద్దంగా లేదు. ‘ నాతో వాదించడానికి నీకు ఎంత ధైర్యం ? ఓహో ఏడాది కిందట నాతో గొడవ పెట్టుకున్న గొర్రె పిల్లవు నువ్వే కదూ ! లేదు నక్క మామా ! అప్పటికి నేనసలు పుట్టలేదు ’’ అని చెప్పింది గొర్రె పిల్ల ఆ మాటలతో నక్కకి పట్టలేనంత కోపం వచ్చింది.  అయితే నాతో గొడవ పడింది మీ అమ్మ అన్నమాట మరి అప్పడు నువు కడుపులోనే కధా ఉన్నావు. కాబట్టి మీ అమ్మ గొడవ పడితే నువ్వూ పడినట్లే అందుకే నీకూ శిక్ష పడాలి.... అంటూ ఒక్కసారిగా ఆ గొర్రెపిల్లపైకి దూకింది నక్క చేతిలోనే చనిపోయింది గొర్రెపిల్ల.  ఈ కథలోని నీతి: మూర్ఖులు, దుష్టులతో అనవసర ప్రసంగాలు చేయకూడదు. వారికి వీలైనంత దూరంగా వుండాలి  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: