ధనం ఉందనీ, బలం ఉందనీ ఎదుటి వాడిని కించ పరచకూడదు.
తనకై తాను గర్వపడకూడదు.
నేనే ధనవంతుడనని మీరనుకుంటే
మీ కంటే ఎక్కువ ధనవుంతులైన వారు
గొప్ప వారు ఈ ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు.
సాయంకాలం వేళ మిణుగురు పురుగులు బయట కొచ్చి నేనే ప్రపంచాన్ని వెలుగుతో నింపుతున్నామని భావిస్తాయి.
కానీ నక్షత్రాలు ఆకాశంలోకి రావడంతో మిణుగురు పురుగు గర్వం పటా పంచలవుతుంది. మెరిసే తారలు ప్రపంచానికి మేమే వెలుగు నిస్తున్నామని అనుకుంటాయి.
కానీ చంద్రోదయం తరువాత తారల వెలుగు మందగిస్తుంది.
ఆకాశంలో కనిపించే చంద్రుడు తనవల్లే ప్రపంచం సంతోషంగా ఉందని మొత్తం భూమిని తానే వెలుగుతో నింపుతున్నాననుకుంటాడు.
ఆ తరువాత తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు. సూర్యోదయ వెలుగులు చూసి చంద్రుడు ఉన్న చోటు తెలియకుండా పోతాడు. ఈ ప్రపంచానికి మేమే గొప్ప అని ఎప్పుడు చెప్పుకోకూడదు.
ఈ కథలోని నీతి : గొప్పలు ఎన్నటికీ చెప్పకూడదు.
మరింత సమాచారం తెలుసుకోండి: