పద్యం

Durga
పూర్వజన్మమందు పుణ్యంబు చేయని పాపి  తా ధనంబు బడయలేదు విత్తనమరచి  కోయ వెదకిన చందంబు  విశ్వదాభిరామ! వినుర వేమ !  బావము : పూర్వజన్మలో ఒక్క పుణ్యకార్యం కూడా చేయకుండా, ఈ జన్మలో ధన, ధాన్యాలతో తులతూగాలని, స్వర్గ సుఖాలు అనుభ వించాలని కోరుకున్నంత మాత్రాన అవి లభిస్తాయా ? విత్తనమే నాటకుండా పంటకు ఆశ పడటం ఎంత అజ్ఞానమో పుణ్య కార్యాలు ఆచరించకుండా సుఖ భోగాలనూ, అష్టైశ్వర్యాలను కోరుకోవడం కూడా అంతే అజ్ఞానం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: