శిబిచక్రవర్తి ఆవేదనలో ఉన్నవారికి సాయం చేసేవాడు ఎవరు ఏది అడిగినా దానం చేసే వాడు.
ఒక రోజున ఒక పావురం వచ్చి ఆయన దగ్గర వాలింది. తనను కాపాడమని బతిమాలింది. ‘‘సరే కాపాడతాను’’ అని ఆయన మాట ఇచ్చాడు. ఇంతలో ఒక డేగ వచ్చింది. ‘‘ ఈ పావురం నా ఆహారం. నేను తినాలి. దాన్ని నాకు ఇచ్చేయ్’’ అని కోపంగా అడిగింది డేగ. ‘‘పావురాన్ని ఇవ్వను దానికి బదులు ఇంకేదయినా అడుగు’’ అన్నాడు.
శిబిచక్రవర్తి ‘‘అయితే పావురమంత బరువు గల నీ తొడమాంసం ఇయ్యి’’ అని అడిగింది డేగ. శిభి చక్రవర్తి తాను తెప్పించి ఒక వైపు పళ్లేంలో తన తొడమాంసం కోసివేశాడు. ఎంత మాంసం కోసి వేసినా పావురంతో సమానం కాలేదు. చివరికి తానే త్రానులో రెండో పళ్లెంలో కూర్చున్నాడు.
పావురానికి బదులుగా మొత్తం తన శరీరాన్నంతా తినెయ్యమని డేగ వేడుకున్నాడు. వెంటనే డేగ ఇంద్రునిగా మారింది. పావురం అగ్నిదేవుడుగా మారింది. వాళ్లను చూసి శిభి ఆశ్చర్యపోయాడు. ఇంద్రుడు అగ్నిదేవుడు ఇలా అన్నారు. ‘‘శిభి చక్రవర్తీ! మేం నిన్ను పరీక్షించాలని వచ్చాం. ఈ పరీక్షలో నీవే గెలిచావు. నీ దానగుణమూ, త్యాగగుణమూ చూసి సంతోషించాం’’ గొప్ప దాతగా భువిలో నీ పేరు నిలిచిపోతుంది.’’ అని దీవించి అదృష్యమైనారు. ఈ కథలోని నీతి : ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది.
మరింత సమాచారం తెలుసుకోండి: