బుడుగు: చిన్నపిల్లలకు చెక్కెర ఇస్తున్నారా.. జాగ్రత్త అదివచ్చేస్తుంది..!?

N.ANJI
మనం ఆరోగ్యంగా ఉండాలంటే చుట్టుపక్కల ప్రేదేశాలు ఎంత పరిశుభ్రంగా ఉండాలో..మనం కూడా అంతే పరిశుభ్రంగా శరీరాన్ని ఉంచుకోవాలి. చిన్నప్పటి నుంచే పిల్లలకు వీటిపై అవగాహన కల్పించాలి. చిన్నవయసులో నేర్చుకునేవే పెద్దఅయ్యేవరకూ పాటిస్తారు. పిల్లల ఆరోగ్యానికి రోజుకు రెండుసార్లు స్నానం చేయాలని ఎలా అయితే తల్లిదండ్రులు నేర్పిస్తారో.. దంత సమస్యలు నివారించేందుకు రెండుసార్లు పళ్లుతోముకోవటం కూడా అంతే అవసరం, బ్రష్ చేసిన ప్రతిసారి తప్పకుండా..నాలుక గీసుకోవాలని చెప్పటం కూడా చాలా ముఖ్యం. చిన్నారులు అనారోగ్యకరమైన అలవాట్లను పెద్దవాళ్లు తొలిదశలోనే గుర్తించాలి. అప్పుడే వాటిని తొలిదశలోనే నివారించగలుగుతాం. చిన్నారులకు దంతసమస్యలు రావటానికి ఐదు కారణాలు ఉంటాయి.
పిల్లలకు ప్రాథమిక దంతాలు రాగానే దంతవైద్యుడిని తప్పక కలవాలి. దంతాలు బలంగా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేది వైద్యులను అడగాలి. ఆ సమయంలో ఎలాంటి సమస్యలు వస్తాయో ముందే తెలుసుకుని అవి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దంత క్షయం రావటానికి మొదటికారణం నోటిశుభ్రత లేకపోవటం. రోజూ నోటిని శుభ్రంగా ఉంచుకోకుండా బ్రష్ చేయకుండా ఉంటే దుర్వాసన కూడా వస్తుంది. కాబట్టి చిన్నారులు నోటిని శుభ్రంగా ఉంచాలి. తొలిదశలో వచ్చే దంతాలు చాలా మృదువుగా ఉంటాయి. వాటిని తల్లి లేదా తండ్రి సున్నితంగా శుభ్రం చేయాలి. స్మూత్ బ్రష్ తీసుకోని చాలా నెమ్మెదిగా క్లీన్ చేయాల్సి ఉంటుంది.
చెక్కెర ఎక్కువగా తీసుకున్నా నోటిలో అనవసరమైన బాక్టీరియా పేరుకుపోతింది. చిన్నపిల్లలకు నోటిని శుభ్రం చేసుకోవటం రాదు..కాబట్టి చెక్కెర తిన్న ప్రతిసారి... నోటిలో బాక్టిరియా మరింత పెరిగి దంతసమస్యలకు దారితీస్తుంది. చాలామంది తల్లులు చేసే మొదటి తప్పు.. పిల్లలు త్వరగా నిద్రపోవాలని పాల్లలో చెక్కెర లేదా తేనె కలిపి ఇస్తుంటారు. ఇది కూడా దంతక్షయానికి కారణం అవుతుంది. కాబట్టి వీలైనంత త్వరగా తల్లులు ఈ పద్దతి మానుకోవాలి. తమ పిల్లలు ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఆహారంతో పాటు పరిశుభ్రత కూడా చాలా అవసరరం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: