బుడుగు: చిన్నారులకు ఆహారపు అలవాట్లు ఇలా మార్చండి..!

N.ANJI
చాలా మంది చిన్న పిల్లలకు ఎలాంటి ఆహారం పెట్టాలో అర్ధం కాక సతమవుతూ ఉంటారు. అయితే మొదటగా చిన్నారులకు కొత్తగా ఘన ఆహారం మొదలు పెట్టినప్పుడు అది బాగా మెత్తగా చేసి ఇవ్వాలి. అలా రోజు పెడుతూ చిన్నారులకు ఆహారపు అలవాటుగా మార్చాలి. ఒకవేళ చిన్నారులు ఏ ఆహారాన్ని అయినా ఇష్టపడకపోతే.. అలాంటివి పెట్టకుండా జాగ్రత్తపడాలి.
వీరికి ఈ వయసులో తల్లిపాలు లేదంటే ఫార్ములా మిల్క్ లేదంటే రెండూ కలిపి ఇవ్వొచ్చు. దాదాపుగా అన్ని పోషకాలు తల్లి పాల నుంచి అందుతాయి. కానీ, విటమిన్ డి తగినంత అందదు. అందుకే వీరిని ప్రతీ రోజూ సూర్యోదయం సమయంలో కొంత సమయం పాటు ఎండలో ఉంచితే విటమిన్ డి అందుతుంది. లేదంటే విటమిన్ డి చుక్కల మందు రూపంలో అందించాలి. అలానే ఐరన్ కూడా వీరికి తగినంత అందదు. అందుకే వైద్యులు ఐరన్, జింక్, విటమిన్స్ కూడిన డ్రాప్స్ ను సూచిస్తుంటారు. పిల్లలకు పాలిచ్చే తల్లులు పూర్తి పోషకాహారాన్ని తీసుకోవడంపై శ్రద్ద పెట్టాలి.
పిల్లలు ఆకలి ఉన్నంత మేర తింటారు. కొంత తిన్న తర్వాత వద్దు అని ముఖం తిప్పుకుంటున్నారంటే వారి కడుపునిండినట్టుగానే అర్థం చేసుకోవాలి. పిల్లలు పెరిగేకొద్దీ వారిలో ఆకలి కూడా అలానే పెరగడం సహజంగానే జరుగుతుంది. చిన్నారులకు ఆహారంతోపాటు బాగా కాచి చల్లార్చిన నీరు కూడా తాగించడం మంచిది. ముఖ్యంగా చిన్నారులకు ఆహారంగా అన్నంలో ఉడికించిన బంగాల దుంప ,నెయ్యీతో మెత్తగా చేసిన ఆహారాన్ని పెడితే బాగా ఇష్టపడి తింటారు. అరటిపండును కూడా బాగా ఇష్టపడి తింటారు. అదేవిధంగా గోధుమ, రాగి, బియ్యంపిండి, కందిపప్పు, నెయ్యీ, నూనే తో ఉడికించిన మెత్తని ఆహార పదార్థమేదైనా ఇవ్వడం మంచిది.
ఇక ఆరు నుండి తొమ్మిది నెలల పిల్లలకు మెత్తని అన్నం, పప్పుతో పాటు కూరగాయలు కూడా ఇవ్వడం మంచిది. పిల్లలు పెరిగేకొద్దీ ఇడ్లి, ఉప్మా, పొంగలి, మజ్జిగ, అన్నం, పాయసం మొదలైనవి పెట్టడం మంచిది. ఇలా ఏ వయసుకు తగ్గట్టు అలా ఆహారం పెట్టడం వల్ల వారిలో శారీరక పెరుగుదల కూడా ఎక్కువగా వుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: