బుడుగు: చిన్న పిల్లలకు ఈ నూనెను ఛాతీ మీద రాస్తే చాల మంచిది తెలుసా..!?

N.ANJI
నిమ్మగడ్డి గురించి చాల తక్కువ మందికి తెలుసు. నిమ్మగడ్డి నుండి వచ్చే నూనెతో చాల ప్రయోజనాలు ఉన్నాయి. ఇక నిమ్మగడ్డి నూనె పలు హైడ్రోకార్బను రసాయనాల సమ్మేళనాల సమాహారం. ఎక్కువగా 10కార్బనులు వున్న హైడ్రోకార్బను సమ్మేళనాలను కల్గి ఉంది. చిన్న పిల్లలకు నిమ్మగడ్డి నూనెను ఛాతీ మీద, మెడల మీద రాసి, వెచ్చటి కాపడం పెడితే కఫం తగ్గిపోతుంది. చిగుళ్ల నుంచి రక్తం కారుతుంటే దానిమ్మపూలను మెత్తగా నూరి పండ్లకు, చిగుళ్లకు రాసి బాగా పట్టేటట్లు రుద్దాలి. ఇలా రోజుకు రెండుసార్లు చొప్పున వారం రోజులు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
అంతేకాక చెవిలో నొప్పి వచ్చినప్పుడు చాలామంది నూనె వంటివి చెవిలో పోస్తుంటారు. ఎట్టి పరిస్ధితిల్లో నూనె వంటి పదార్ధాలను చెవిలో వేయకూడదు. ఇవి ఇన్‌ఫెక్షన్‌‌ను మరింత పెంచే అవకాశం ఉంది. చలికాలంలో వచ్చే జలుబు, దగ్గు, ఫ్లూ వంటి రుగ్మతలకు తేనె, పసుపు చక్కటి విరుగుడు. రోజుకు రెండుసార్లు ఒక టీస్పూను తేనెలో చిటికెడు పసుపు కలిపి తీసుకోవాలి. తేనె లేనట్లయితే ఒక గ్లాసు వేడిపాలలో చిటికెడు పసుపు కలిపి తాగాలి.
ఇక చారులో మిరియాల పొడి నెయ్యి పోపు పెట్టి... దాంతో భోంచేస్తే కఫం తగ్గుతుంది. ఉదయాన్నే తులసి ఆకులను పిడికెడు దంచి కషాయంగా కాచి కానీ, ఆ రసంలో ఒక చెంచా తేనె చేర్చి కానీ తాగితే కోలుకుంటారు. నిమ్మగడ్డి నూనెను ముఖ్యంగా సబ్బులు,షవరు జెల్, సువాసన ద్రవ్యాల తయారీ లో,అలాగే విటమీనుల తయారీ, దోమలను పారదోలు ద్రవాలలో ఉపయోగిస్తారు. నూనెలోని సిట్రాల్ యాంటీ మైక్రో బియాల్ ప్రభావశీలి కావున ఇది బాక్టీరియా,, శిలీంద్ర నాశినిగా పనిచేయును.అలాగే నూనెలో వున్న లిమోనెన్ కూడా ఇన్ఫ్లమేసన్ తగ్గించి,బాక్టీరియాను చంపును.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: