బుడుగు : ఆడపిల్లల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. !!

Suma Kallamadi
ఆడపిల్లలు ఉన్న ఇంట్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈకాలంలో  చిన్నపిల్లలకు కూడా రక్షణ కరువయింది. నష్టం జరిగాక బాధపడే కంటే నష్టం జరగకముందు జాగ్రత్త తీసుకుంటే మంచిది. అందుకనే ఆడపిల్లలు ఉన్న ఇంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి. ఈ కాలంలో ఎవరు ఎలాంటి వారు అనేది అర్ధం కావడం లేదు. మాటలు మంచిగానే చెబుతారు. మనసులో మాత్రం  నీచపు ఆలోచనలతో ఉంటారు. అందుకనే ఇంటికి దూరపు చుట్టాలు వచ్చినప్పుడు మీ పిల్లలని మీ బెడ్ రూంలోనే పడుకోబెట్టుకోవడం ఉత్తమమైన పని.

అలాగే పిల్లలు బయట ఆడుకుంటున్నారు కదా అని గంటలు గంటలు పనిలో తలమునకలై, పట్టించుకోకుండా ఉండడం అంత మంచిది కాదు. తల్లితండ్రులతో  పిల్లలు ఏదైనా చెప్పడానికి సంకోచిస్తున్న, లేదా మూడీగా ఉన్నా, భయం భయంగా చూస్తున్న, వాళ్ళల్లో వాళ్ళే మధనపడుతున్నా, ఏదో జరిగింది అని గ్రహించి ప్రేమగా ఆరా తియ్యండి.
లైంగిక విషయాలలో ఎవరిమీద అయినా పిల్లలు ఫిర్యాదు చేసినప్పుడు తేలిగ్గా తీసుకోవద్దు. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి  12 ఏళ్ల బాలురు నుంచి వృద్దులు వరకూ ఆడ పిల్లలకు లైంగిక శత్రువులేనన్న విషయం గుర్తుపెట్టుకోండి. మీ పిల్లలతో మీరు ప్రేమగా ఉండండి.వాళ్ళు స్వతంత్రముగా మీకు ఏ విషయాన్ని చెప్పడానికి సంకోచించకుండా చూసుకోండి. అలాగే ఆడపిల్లలకు మార్షల్ ఆర్ట్స్ లో కొన్ని టెక్నిక్స్ వున్నాయి. వాటిని నేర్పించoడి.

స్కూల్ లో ,ట్యూషన్ లో  ఇతరుల ప్రవర్తన  ఎలా ఉందొ రోజు కనుక్కోండి. ప్రతీ మనిషి దగ్గిర ఒక పది అడుగుల దూరం పాటించమని చెప్పండి.  ఏదైనా డేంజర్ ఉంది అని అనిపిస్తే,  ముందుగా  గట్టిగా అరిచి గోల చేయమని చెప్పండి. తరువాత  అందుబాటులో వున్న రాయి, కర్ర ఇసుక  లాంటివి వాడి వాళ్ళనుంచి  తప్పించుకోవడం లో ట్రైనింగ్  ఇవ్వండి.  పారిపోవడానికి దారులు చూసుకోవడం నేర్పించండి.
అన్నిటికి మించి ఏ విషయం అయినా ఇంట్లో చెప్తే తిడతారు అన్న భయాన్ని పోగొట్టండి. ఇంట్లో అన్న తమ్ముళ్లు ఉంటే, సోదరికి  సపోర్టివ్ గా ఉండటం నేర్పించండి. మన ఇంటి మహాలక్ష్మి ఎప్పుడు నవ్వుతూ ఉండేలా చూసుకోవలసిన బాధ్యత మనదే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: